‘బిపార్జోయ్’ తుఫాను దూసుకొస్తుండగా.. గుజరాత్ ప్రజలను వణించిన భూకంపం
గాంధీనగర్:బిపార్జోయ్ తుఫాను కారణంగా గుజరాత్ ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే.. ఇప్పుడు భూకంపం వారిని వణికించింది. కచ్ జిల్లాలో 3.5 తీవ్రతతో బుధవారం భూకంపం సంభవించింది. స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కాగా, వరుసగా రెండు రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. బుధవారం జమ్మూకాశ్మీర్‌లోని నాలుగు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
కాగా, అధికారులు దోడా, కిష్ట్వార్ జిల్లాలో స్కూళ్లను మూసేశారు. కిష్ట్వార్ ప్రాంతంలో 3.3 తీవ్రతతో ఉదయం 8.29 గంటలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది. దీనికి ముందు దోడాలో బుధవారం తెల్లవారుజామున 3.5 తీవ్రతతో, 4.5 తీవ్రతతో, దీనికంటే ముందు రియాసి జిల్లాలో 2.8 తీవ్రతతో తెల్లవారుజామున 2.23 గంటలకు భూ ప్రకంపనలు చోట చేసుకున్నాయి.

మరోవైపు, బిపార్జోయ్ తుఫాను గుజరాత్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపార్జోయ్ తుపాను తీరం దిశగా దూసుకొస్తోంది. గురువారం సాయంత్రం ఈ తుపాను ముందుగా అనుకున్నట్లుగా జఖౌ దగ్గర కాకుండా.. దిశ మార్చుకుని కచ్ దగ్గరే తీరం దాటనున్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు.
కాగా, బుధవారం సాయంత్రం 3 గంటల సమయానికి గుజరాత్ తీరానికి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుపాను కేంద్రం.. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. తీరం దాటే సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తగిన చర్యలు తీసుకుంటున్నాయి.
గుజరాత్‌లోని కచ్, ద్వారక, సౌరాష్ట్ర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ అధికారులు. కచ్, ద్వారక, పోర్ బందర్, జామ్ నగర్, మోర్బీ, జునాగఢ్, రాజ్‌కోట్ జిల్లాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా గుజరాత్‌లోని ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇప్పటికే 47వేల మంది తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి. కాగా, తుపాను ప్రభావం గుజరాత్, మహారాష్ట్రలతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా, కేరళ, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, లక్ష్యద్వీప్, దాద్రానగర్ హవేలీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications