వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పకూలిన 2భవనాలు: ముగ్గురు మృతి, శిథిలాల కింద 30మంది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానికి సమీపంలోని గ్రేటర్‌ నోయిడాలో మంగళవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనంపై కుప్పకూలింది. దీంతో ఆ భవనం కూలిపోయాయి. నాలుగు అంతస్తుల భవనంలో మొత్తం 18 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

ఈ సమాచారం అందిన వెంటనే స్థానిక యంత్రాంగం సహాయచర్యల్లో భాగంగా శిథిలాలను తొలగించే పనులను చేపట్టింది. శిథిలాల నుంచి మూడు మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. భవన శిథిలాల్లో 30 మంది వరకూ చిక్కుకున్నారు. మరో 50 మందికి గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు.

3 dead after a 6 storey building falls on another near Delhi, rescue ops on

పొరుగున ఉన్న ఘజియాబాద్‌ నుంచి జాతీయ విపత్తు నివారణ బృందాన్ని రప్పించారు. వందలాది మంది పోలీసులు కూడా సహాయచర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపటి వరకు అధికారులు ఎవరూ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్థానికులు భారీ సంఖ్యలో చేరుకుని నిరసనకు దిగారు.

భ‌వ‌నాలు కూలిన ఘ‌ట‌న‌పై ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కాగా, ఈ ప్రమాదానికి బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Three people have been arrested in connection with the collapse of a six-storey under-construction building which claimed three lives in Greater Noida near Delhi on Tuesday. The building fell on top of a four-storey building in which 18 families lived in the Shah Beri village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X