వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎన్ఎస్ రణవీర్‌లో పేలుడు.. ముగ్గురు మృతి

|
Google Oneindia TeluguNews

ముంబయిలోని నావల్ డాక్ యార్డులో ప్రమాదం జరిగింది. భారత నౌకాదళానికి చెందిన డిస్ట్రాయర్ శ్రేణి యుద్ధనౌక ఐఎన్ఎస్ రణవీర్‌లో పేలుడు సంభవించింది. దీంతో ముగ్గురు నావికా దళ సిబ్బంది మృతి చెందారు. వారు తీవ్రంగా గాయపడి చనిపోయారు. ఘటనపై రక్షణశాఖ ప్రకటన చేసింది. ఘటన దురదృష్టకరం అని అభిప్రాయపడింది. ప్రమాదంలో మరో 11 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిని ముంబయిలోని నేవీ ఆసుపత్రికి తరలించారు. అంతర్జాతీయ సరిహద్దు జిల్లాలో ఐఎన్ఎస్ రణవీర్ విధులు నిర్వహిస్తూ ఉంటుంది.

3 personnel dead in explosion onboard INS Ranvir

నౌకలో చెలరేగిన మంటలను సిబ్బంది అదుపులోకి తెచ్చారు. నౌకలో ఉన్న ఆయుధాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని కేంద్ర రక్షణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వివరించింది. ఐఎన్ఎస్ రణవీర్ తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి క్రాస్ కోస్ట్ ఆపరేషనల్ విస్తరణలో ఉంది. త్వరలో బేస్ పోర్ట్‌కు రావలసి ఉంది. ఇంతలోనే ప్రమాదం జరిగింది.

ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న నేవీ, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, అయితే పెద్దగా నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. కాగా ఐఎన్ఎస్ రణవీర్ తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి క్రాస్ కోర్ట్ ఆపరేషన్స్ లో ఉంది. కాసేపట్లో బేస్ పోర్ట్‌కు తిరిగి రావలసి ఉంది. అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు భారత నౌకాదళం ప్రకటించింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
explosion in an internal compartment onboard INS Ranvir claimed the lives of three naval personnel on Tuesday, an official release said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X