వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 ఉగ్రవాదుల హతం.. ఇద్దరు కశ్మీర్ ఉద్యోగిపై కాల్పులు జరిపిన వారే..

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగిని కార్యాలయంలో ఉగ్రవాదులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఇదీ పెను దుమారం రేపింది. కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యారు. కశ్మీర్ బందిపొర బ్రార్ ఆరాగమ్‌లో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. వీరిలో ఇద్దరు నిన్న కాల్పులు జరిపిన వారు ఉన్నారు. మరొ ఉగ్రవాది పాకిస్థాన్ నుంచి చొరబడి ఉంటారని పోలీసులు అంటున్నారు.

బుధవారం కూడా బందిపొరలో భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. వారిలో ఒకడు చనిపోగా.. ఇద్దరు పారిపోయారు. ఆ ఇద్దరే శుక్రవారం మృతిచెందారు. ఆ ఇద్దరు పాకిస్థాన్ నుంచి చొరబడ్డారని కశ్మీర్ ఐజీ తెలిపారు. జమ్ముకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. అతని కార్యాలయంలో ఉగ్రవాదులు చొరబడి ఫైర్ చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు.

3 terrorists gunned down in jammu Kashmir

కశ్మీర్ పండిట్‌పై కాల్పుల గురించి ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను చంపేందుకు కార్యాలయంలోని తోటి ఉద్యోగులే ఉగ్రవాదులతో కలిసి కుట్ర చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. పని చేస్తున్న కార్యాలయంలో తనకు భద్రత లేదని తనతో అన్నారని చెప్పారు. జిల్లాలో గల ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయాలని విన్నవించుకున్నారని చెప్పారు. అయినా అధికారులు స్పందించలేదని వాపోయారు. దీంతో తన భర్త చనిపోయాడని విలపించారు. తమ కుటుంబ పెద్ద లేకపోవడానికి కారణం ఎవరూ అని అడిగారు.

English summary
Three terrorists died in an encounter broke out in Brar Aragam area of Bandipora in Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X