‘‘12 ఏళ్లలో నాలుగుసార్లు.. ఇక సహించను.. అవసరమైతే ప్రధాని వద్దకైనా వెళ్తా’’

Posted By:
Subscribe to Oneindia Telugu

బరేలీ: ఓ యువతి తలాక్ పేరు తలుచుకుని భయపడిపోతోంది. గడిచిన పన్నెండేళ్లలో మూడుసార్లు తలాక్‌ వేటును ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు ఉన్న భర్త కూడా ఎక్కడ తలాక్‌ చెప్పేస్తాడో అని భయపడిపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే తన జీవితమే తనకు ఓ పీడకలగా ఉందంటూ వాపోతోంది.

ఇది ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన తారాఖాన్‌ (35) కథ . ఆమె ఒక నిరక్షరాస్యురాలు. తొలి వివాహం జహీద్‌ ఖాన్‌ అనే వ్యక్తితో జరిగింది. అతడిది బరేలీలోని తహకా నగారియా అనే గ్రామం. అయితే, పెళ్లయిన ఏడేళ్లకు కూడా వారికి సంతానం లేదు. దీంతో జహీద్‌ ఖాన్‌ మరో యువతిని వివాహం చేసుకొని తారాఖాన్‌ కు తలాక్‌ చెప్పేశాడు.

దీంతో ఆమెకు మరో సంబంధం చూసి పప్పుఖాన్‌ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. 'పప్పు నన్ను తీవ్రంగా హింసించేవాడు. ఒకసారి ఇలాగే చేస్తుంటే అడ్డుకున్నాను. దీంతో అనకూడని మాటలని బాగా కొట్టాడు' అంటూ తారాఖాన్ గతం గుర్తుచేసుకుంటుంది.

 3 triple talaqs in 12 years: The saga of a Muslim woman

ఇలా ఆమె రెండో వివాహం కూడా మూడేళ్లలోనే ముగిసిపోయింది. తన మేనమామ ఇంటికెళ్లిన తర్వాత నచ్చజెప్పి మూడోసారి సోనూ అనే వ్యక్తితో వివాహం జరిపించారని కానీ, కాలక్రమంలో అతడు కూడా అంతకుముందు వివాహం చేసుకున్నవారికంటే దారుణంగా మారి చిత్రహింసలు పెట్టే భర్తగా మారాడని వాపోయింది.

ఒక రోజు బాగా కొట్టి తిరిగి తన మేనమామ వాళ్లింటికి తీసుకొచ్చి మూడుసార్లు 'తలాక్‌' అని చెప్పేసి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఆమె మూడో వివాహం నాలుగు నెలలు మాత్రమే నిలివగా, నాలుగోసారి ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పి షంషాద్‌ అనే వ్యక్తితో వివాహం జరిపించారు.

అయితే, అతడు కూడా తనను ఎక్కడ వదిలేస్తాడోనని భయంగా ఉందని, వాస్తవానికి ఈ పన్నెండేళ్లలో తాను ఏ తప్పు చేయకపోయినా ఇలాంటి దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నానంటూ వాపోతోంది తారాఖాన్.

'శంషాద్‌ కూడా మాజీ భర్తల మాదిరిగా చేస్తే ఎక్కడికి వెళ్లాలో అర్ధం కావడం లేదు.. ఇప్పటికే మా మధ్యన చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి.. ప్రస్తుతం పోలీస్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌కు వెళుతున్నాను.. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లిని మాత్రం కాపాడుకుంటా.. అవసరమైతే ప్రధాని నరేంద్రమోడీకి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ వద్దకైనా వెళ్లి నాగోడు వెళ్లబోసుకుంటా..' అని అంటోంది తారాఖాన్. పాపం.. చాపకింద నీరులా 'ట్రిపుల్ తలాక్' ఇంకెంతమంది ముస్లిం మహిళల జీవితాలను కబళిస్తోందో?

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tara Khan, who is 35-year-old woman has been already given triple talaq for three times in her past marriages and is now terrified that her fourth husband may also do the same. Khan who is an illiterate woman said that it was a nightmare for 12 years and if her fourth husband too gives her triple talaq then she has nowhere to go. Recalling her 12 years of struggle, Khan said that her fourth husband, Shamshad whom she married after finding him through matrimonial site ought to be like the rest of the husband. Currently, Tara Khan and Shamshad have been going to a family counselling centre at Police Lines in Bareilly. According to Khan, if need arises she would even approach Prime Minister Narendra Modi and chief minister Yogi Adityanath.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి