ట్యూషన్ సెంటర్లోనే ముప్పై విధ్యార్థినులపై అత్యాచారం,వీడియోలు తీసి బెదిరించేవారు

ట్యూషన్ కు వచ్చే విధ్యార్థినులతో లైంగిక వాంఛ తీర్చుకొంటున్నాడు ట్యూషన్ సెంటర్ నిర్వాహకుడు. ధర్మపురి జిల్లాలోని పాలక్కోడ్ లో శివకుమార్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ట్యూషన్ సెంటర్లను నిర్వహిస్తున్నాడు.

చెన్నై :ట్యూషన్ కు వచ్చే విధ్యార్థినులకు మత్తుమందు ఇచ్చి నిర్వాహకులు లైంగిక వాంఛ తీర్చుకొంటున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముప్పై మందిపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. విధ్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని పాలక్కోడుకు చెందిన శివకుమార్ తన స్నేహితులైన ఈశ్వరన్, శివలతో కలిసి పాలక్కోడు, ధర్మపురిలలో ట్యూషన్ సెంటర్లను నడుపుతున్నాడు. నాలుగేళ్ళుగా ఈ ట్యూషన్ సెంటర్లలో పదవ తరగతి, ఇంటర్ విధ్యార్థులకు కోచింగ్ ఇస్తున్నారు.

ఈ ట్యూషన్ సెంటర్లలో సుమారు వంద మంది విధ్యార్థులు కోచింగ్ తీసుకొంటున్నారు. ట్యూషన్ వచ్చే విధ్యార్థినులకు స్పెషల్ క్లాసుల పేరుతో శివకుమార్ ఎక్కువసేపు కోచింగ్ సెంటర్లోనే ఉంచుకొనేవాడు.

sexual appetite

స్పెషల్ క్లాసుల పేరుతో విధ్యార్థినులను ఆలస్యంగా కోచింగ్ సెంటర్లలోనే ఉంచుకొనేవాడు. ఆ సమయంలో శఈతల పానీయాల్లో, టీ లో కాని మత్తుమందు కలిపి ఇచ్చేవాడు. వారు స్పృహకోల్పోగానే వారితో అసభ్యంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు. వాటిని చూపించిన తర్వాత వారితో అసభ్యంగా ప్రవర్తించి తన కోరిక తీర్చుకొనేవాడు. ఈ దారుణాలను వీడియో తీసేవాడు. ఈశ్వరన్, శివలు కూడ ఈ వీడియోలను బయటపెడతామని బెదిరించి విధ్యార్థినులు లొంగదీసుకొన్నారు. రెండేళ్ళలో సుమారు ముప్పై మంది విధ్యార్థినులను ట్యూషన్ సెంటర్ నిర్వాహకులు తమ లైంగికవాంఛ తీర్చుకొన్నారు.

ఎట్టకేలకు ఈ విషయం వెలుగు చూడడంతో ట్యూషన్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ట్యూషన్ సెంటర్ల నిర్వాహకుల దురాగతం వెలుగుచూడడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+