పంజాబ్ పాలిటిక్స్: అమరీందర్ సింగ్ రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్..? 30 మంది ఎమ్మెల్యేలు

పంజాబ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సిద్దు వర్సెస్ అమరీందర్ సింగ్ మధ్య విభేదాలు పీక్‌కి చేరాయి. ఎలా అంటే.. సిద్దు వర్గం అంతా కలిసి.. అమరీందర్ సింగ్ రాజీనామాకు డిమాండ్ చేసింది. దీంతో పంజాబ్‌లో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. నలుగురు మంత్రులు సహా.. 30 మంది ఎమ్మెల్యేలు సిద్దు వెంట ఉన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ సలహాదారులు ఇద్దరు కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీళ్ల మాటలపై ప్రతిపక్షంతోపాటు, అధికార పక్ష నేతలు కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం అమరీందర్ సింగ్ కూడా సదరు సలహాదారుల వ్యాఖ్యలను తప్పుబట్టినట్లు సమాచారం. దీంతో సిద్ధూ వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు ఒక గ్రూపుగా మారి అమరీందర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. వీరిలో నలుగురు మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం.

30 mlas demand amarinder reisignation

త్రిపాట్ రాజీందర్ బజ్వా, సుఖ్‌జీందర్ సింగ్ రంధావా, చరణ్‌జీత్ సింగ్ చన్ని, సుఖ్‌బీందర్ సింగ్ సర్కారియాతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పర్గాత్ సింగ్.. వీళ్లంతా సిద్ధూ వర్గానికి చెందిన వారనే సంగతి తెలిసిందే. వీళ్లు త్వరలోనే పార్టీ హైకమాండ్‌ను కలిసి అమరీందర్‌ను సీఎంగా తొలగించాలని కోరనున్నారట. 2017 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని ఈ రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.

Recommended Video

    Spl interview on Gandhi Hospital Rape incident with ysrtp leaders

    తాను త్రిపాట్ బజ్వాతో సమావేశమైనట్లు సిద్ధూ కూడా ట్వీట్ చేశారు. బజ్వాతోపాటు మరికొందరు పార్టీ కార్యకర్తలను కలిశానని, ప్రస్తుత పరిస్థితిపై హైకమాండ్‌కు వివరణ ఇస్తామని ఆయన తెలిపారు. సిద్ధూ సలహాదారుల్లో ఒకరైన మల్వీందర్ సింగ్ మాలి ఇటీవల ఒక ట్వీట్ చేశారు. ''కశ్మీర్ ఒక ప్రత్యేక దేశం. భారత్, పాకిస్థాన్ రెండూ అక్రమంగా ఆక్రమించుకున్నవే. ఇది కశ్మీర్ ప్రజల సొంతం'' అని మల్వీందర్ ట్వీట్ చేశారు. ఇది చాలా వివాదాస్పదంగా మారింది. దీంతోపాటు మరో సలహాదారు ప్యారే లాల్ గర్గ్ కూడా పాకిస్థాన్‌ను అమరీందర్ విమర్శించడాన్ని తప్పుబట్టి వివాదానికి తెరలేపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+