వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ గ్రామంలో కోతుల పేరిట 32ఎకరాల భూమి; అక్కడ కోతులకు ప్రత్యేక స్థానం.. ఎక్కడంటే!!

|
Google Oneindia TeluguNews

ఎక్కడైనా మనుషుల పేరు మీద, లేదా వివిధ సంస్థల పేరుమీద, ఆలయాల పేరుమీద భూములు రిజిస్ట్రేషన్ అయి ఉండటం ఎవరైనా చూసి ఉంటారు. కానీ జంతువుల పేరుమీద భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడా ఎవరూ చూసి ఉండరు. అటువంటి విచిత్రమైన సంఘటన ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది.. ఆ గ్రామంలో మనుషుల పేరు మీద కాకుండా వేటిపైన భూములు ఉన్నాయి అంటే..

 కోతుల పేరు మీద 32ఎకరాల భూమి

కోతుల పేరు మీద 32ఎకరాల భూమి


మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో మనుషుల పేరు మీద కాకుండా కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఉస్మానాబాద్ లోని ఉప్లా గ్రామంలో కోతుల పేరుమీద భూమి రిజిస్ట్రేషన్ అయి ఉండటం మనకు ఆశ్చర్యంగా అనిపించినా, ఆ గ్రామస్థులలో మాత్రం ఎటువంటి ఆశ్చర్యం లేదు. కోతుల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ ఏంటి అన్న ప్రశ్న అక్కడ ఉత్పన్నం కాదు. ఉప్లా గ్రామపంచాయతీలో గుర్తించిన భూముల రికార్డులలో 32 ఎకరాల భూమి ఏకంగా కోతుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఆ గ్రామంలో నివసిస్తున్న కోతులు ఆ భూములకు యజమానులు.

 కోతులకు గ్రామంలో సముచిత స్థానం ఉందన్న గ్రామ సర్పంచ్

కోతులకు గ్రామంలో సముచిత స్థానం ఉందన్న గ్రామ సర్పంచ్


అయితే ఈ భూమిని ఎవరు కోతుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారో తమకు తెలియదని, అది ఎప్పుడు జరిగిందో కూడా తమకు తెలియదని గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్ తెలిపారు. అంతేకాదు తమ గ్రామంలోని ప్రజలకు కోతుల పైన ఎనలేని అభిమానం ఉంటుందని, కోతులు ఎవరైనా ఇంటి గుమ్మం ముందుకు వస్తే వాటికి ఆహారం పెట్టకుండా పంపించరు అని చెబుతున్నారు. గతంలో పెళ్ళిళ్ళలో , ప్రతి వేడుకలలోనూ కోతులకు సరైన ప్రాధాన్యత ఇచ్చేవారమని వివరించారు. ఇళ్లల్లో శుభకార్యం జరిగితే ముందు కోతులకు బహుమానాలు ఇచ్చేవారని ఆయన పేర్కొన్నారు.

కోతుల పేరు మీద ఉన్న భూములను కబ్జా చెయ్యకుండా కాపాడటం విశేషం

కోతుల పేరు మీద ఉన్న భూములను కబ్జా చెయ్యకుండా కాపాడటం విశేషం


గతంలో తమ గ్రామంలో పెద్ద సంఖ్యలో కోతులు ఉండేవని పేర్కొన్న గ్రామ సర్పంచ్, ప్రస్తుతం కోతుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది అని వెల్లడించారు. ప్రస్తుతం గ్రామంలో 100 వరకు కోతులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక కోతుల పేరుతో ఉన్న 32 ఎకరాల భూమిలో గతంలో ఫారెస్ట్ అధికారులు పెద్ద మొత్తంలో మొక్కలు నాటారని చెప్పారు. కోతుల పేరుతో భూములు ఉండడమే విశేషమైతే, సంవత్సరాలుగా ఆ భూములను ఎవరూ కబ్జా చేయకపోవడం మరింత ఆసక్తిని కలిగించే అంశం. మనుషుల పేరు మీద రిజిస్టర్ అయిన భూములనే కబ్జాలు చేస్తున్న నేటి రోజుల్లో, కోతుల పేరుతో ఉన్న భూమిని కబ్జా చేయకపోవడం ఒకింత ఆసక్తికరమైన అంశం.

English summary
In upla village in Osmanabad district of Maharashtra there is 32 acres of land in the name of monkeys. The sarpanch of Upla village says that there is a special place for monkeys and they are respected by all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X