34 శాతం మందిపై క్రిమినల్ కేసులు, హత్య, రేప్ అభియోగాలు.. అన్నీ పార్టీల నుంచి: ఏడీఆర్
బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరిత్ర గల అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. రెండో విడత వచ్చేనెల 3వ తేదీన 94 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే 34 శాతం అంటే 1463 మంది నేరచరిత్ర గల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విషయాన్ని ఏడీఆర్ సంస్థ నివేదించింది. వీరికి ఏదో విషయంలో గొడవ, హత్య, లైంగికదాడికి సంబంధించిన కేసులు ఉన్నాయని సంస్థ వివరించింది.

27 శాతం మందిపై తీవ్ర అభియోగాలు
వీరిలో 27 శాతం మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. 389 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో వీరికి కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరో 502 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక అభ్యర్థులు ఆస్తుల వివరాలను కూడా ప్రకటించారు. 495 మంది తాము కోటిశ్వరులు అని పేర్కొన్నారు. ముగ్గురు మాత్రం తమ వద్ద ఆస్తులు లేవని చెప్పారు.

అన్నీ పార్టీల నుంచి అభ్యర్థులు..
36 మంది ఆర్జేడీకి చెందిన అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. 28 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీకి సంబంధించి 29 మందిపై క్రిమినల్ కేసులు..20 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎల్జేపీకి సంబంధించి 28 మందిపై క్రిమినల్ కేసులు.. 24 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 14 మంది కాంగ్రెస్, 16 మంది బీఎస్పీ, 20 మంది జేడీయూ క్రిమినల్ కేసులు ఉన్నాయి.
Recommended Video

లైంగికదాడి, హత్య కేసులు
14 మంది బీఎస్పీ, 24 మంది కాంగ్రెస్, 15 మంది జేడీయూ అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 49 మందిపై మహిళలపై వేధింపులు.. నలుగురు లైంగికదాడులు చేశారని నివేదిక పేర్కొన్నది. 32 మంది హత్య చేశారని.. వారిపై 302 కింద కేసు ఉందని తెలిపింది. 143 మందిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది అని తెలిపింది. 84 నియోజకవర్గాలు రెడ్ అలర్ట్ కింద ఉన్నాయని వివరించింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications