ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. 2008లో ఈ స్థానం నుండి చివరిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి గెలుపొందారు.
రాష్ట్రపతి కుమార్తె అయినప్పటికీ శర్మిష్ట తన తండ్రి ప్రభావం ఏమీ లేకుండా ఆమె సాదాసీదాగా ప్రచారం చేసుకుంటున్నారు. తన తండ్రి రాష్ట్రపతిగా కాకుండా ప్రజల మనిషిగా నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలకు సుపరిచితుడు అని తెలిపారు.

దేశాధినేత కుమార్తె కావడంతో తన గెలుపు పైన ఎక్కువ అంచనాలు ఉన్నాయని ఆమె అంగీకరించారు. కైలాష్ స్థానం ఓ అసెంబ్లీ స్థానం మాత్రమే కాదని, 1986 నుండి అది తమకు సొంత ఇంటితో సమానమని శర్మిష్ట చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ థర్డ్ లిస్ట్‌లో శర్మిష్ట పేరును పేర్కొననుంది.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... తాను దేశ ప్రధానికి వ్యతిరేకంగా పోటీ చేయడం లేదని, తన ప్రత్యర్ధిపై తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గంలో సమస్యలొస్తే మోడీ వచ్చి తీర్చలేరని, అభ్యర్ధే ఆ పని చేయాల్సి వస్తుందన్నారు. అభ్యర్ధి మంచివాడా.. సమర్ధుడా.. అందుబాటులో ఉంటాడా, లేదా అనేది ఓటర్లే నిర్ణయించాలని షర్మిష్ఠా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, ప్రజా సమస్యలపై పోరాడుతానన్నారు.












Click it and Unblock the Notifications