మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు: ఆర్మీ వాహనాలపై దాడి, నలుగురు జవాన్ల వీరమరణం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పూంఛ్ జిల్లాలో గురువారం రెండు ఆర్మీ వాహనాలపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు అమరులు కాగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రాజౌరీ-థనామండీ-సురన్​కోటె మార్గంలోని సావ్నీ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

బుఫ్లియాజ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో జవాన్లను తరలిస్తున్న ఓ ట్రక్కు, జిప్సీ వాహనాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు, ముష్కరులకు మధ్య ఎన్‌​కౌంటర్ కొనసాగుతోందని రక్షణ శాఖ పీఆర్ఓ కార్యాలయం తెలిపింది.

4 Army Men Martyred As Terrorists Attack Army Vehicles In Jammu & Kashmirs Poonch

ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రీయ రైఫిల్స్-48 పరిధిలో ఈ ఆపరేషన్ జరుగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఉగ్రదాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అప్పుడు ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.


కాగా, తాజాగా, 'ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల కచ్చితమైన సమాచారంతో బుధవారం రాత్రి జాయింట్ ఆపరేషన్ చేపట్టాం. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నాం. ఆ సమయంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. బలగాలు దీటుగా స్పందించాయి' అని డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్త్​వాల్ వెల్లడించారు. ఉగ్రవాదులతో సైనికులు ముష్టి యుద్ధం కూడా చేశారని అధికార వర్గాల సమాచారం. దాడి తర్వాత ఉగ్రవాదులు సైనికుల ఆయుధాలతో పారిపోయారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+