
పేలిన సిలిండర్, నలుగురు మృతి, 16 మందికి గాయాలు
రాజస్థాన్ జోధ్‌పూర్‌లో సిలిండర్ పేలింది. మాగ్రా పుంజ్లా ఏరియాలో గల రెసిడెన్షియల్ కాలనీలో ప్రమాదం జరిగింది. ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్‌లోకి గ్యాస్ నింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదీ అక్రమం.. అయినా గ్యాస్ నింపడంతో యాక్సిడెంట్ అయ్యింది. దీంతో కొందరు చనిపోగా.. మరికొందరు గాయపడ్డారు.
ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మరో 16 మంది గాయపడ్డారు. వారిని సమీపంలో గల మహాత్మా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోకి ఫైరింజన్లు చేరుకొని.. మంటలను ఆర్పివేస్తున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ హిమాన్హు గుప్తా పరిశీలించారు. వారికి మెరుగైన చికిత్స అందజేస్తామని తెలిపారు.

కొన్ని ఘటనల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. అక్రమంగా పనులు చేయడంతో ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం వల్లే ఇలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి.