నలుగురి మృతి, మరో నలుగురికి గాయాలు.. పేవ్‌మెంట్ పైకి దూసుకొచ్చిన కారు.. ఎక్కడంటే..
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. క్రాఫోర్డ్ మార్కెట్ వద్ద గల కేఫ్ జనతా రెస్టారెంట్ వద్ద యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వచ్చిన కారు పేమెంట్ మీద ఉన్న వారిని ఢీ కొంది. ప్రమాదంలో నలుగురు చనిపోగా.. మరో నలుగురు గాయపడ్డారు. రెస్టారెంట్ వెలుపల బయట కూర్చొన్న వారిపై కారు ఒక్కసారిగా దూసుకొచ్చింది. సోమవారం రాత్రి 9.15 గంటలకు ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన చోటకి వెంటనే పోలీసులు చేరుకున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో ఉన్న డ్రైవర్ కూడా గాయపడటంతో క్షతగాత్రులను చేర్చిన జేజే.. ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐదుగురు గాయపడ్డారని చెప్పారు. కానీ తర్వాత వారి సంఖ్య నలుగురు అని పేర్కొన్నారు. ముంబైకి చెందిన జ్యోతి బాబారియా కారు వైట్ ఎస్టీమ్ కారు పేమెంట్ ఉన్నవారిపైకి దూసుకెళ్లింది.












Click it and Unblock the Notifications