సుప్రీంలో అవాంఛనీయ సంఘటనలు, చీఫ్ జస్టిస్ వినలేదు: చరిత్రలో తొలిసారి 4గురు జడ్జిల ప్రెస్‌మీట్

Posted By:
Subscribe to Oneindia Telugu
చరిత్రలో తొలిసారి 4గురు జడ్జిల ప్రెస్‌మీట్..!

న్యూఢిల్లీ: భారత దేశ చరిత్రలో తొలిసారి సుప్రీం కోర్టు జడ్జిలు శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వారు న్యాయవ్యవస్థలోని అవినీతిపై మాట్లాడుతున్నారు. నలుగురు జడ్జిలు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం తొలిసారి.

జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసంలో నలుగురు జడ్జిలు మీడియాతో మాట్లాడారు. సుప్రీం చీఫ్ జస్టిస్ పైన ఈ జడ్జిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు గౌరవాన్ని రక్షించాల్సి ఉందన్నారు.

చీఫ్ జస్టిస్‌ను అడిగాం కానీ లాభం లేదు

చీఫ్ జస్టిస్‌ను అడిగాం కానీ లాభం లేదు

సమస్యలను పరిష్కరించాలని తాము ప్రధాన న్యాయమూర్తిని అడిగామని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. అయినా ప్రయోజనం లేకపోయిందన్నారు. సుప్రీం కోర్టులో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయన్నారు. అందుకే తాము ప్రజల ముందుకు వచ్చామని చెప్పారు. సుప్రీం కోర్టులో పాలనా వ్యవహారాలు సరిగా సాగడం లేదన్నారు.

స్వతంత్రంగా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి అవసరం

స్వతంత్రంగా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి అవసరం

స్వతంత్రంగా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి అవసరమని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. తాము అత్యవసర పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడవలసి వస్తోందని చెప్పారు. జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపైన ఉందని చెప్పారు. సుప్రీం పవిత్రతను కాపాడకుంటే ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అన్నారు.

సీజేపై అభిశంసన దేశ ప్రజలు చెప్పాలి

సీజేపై అభిశంసన దేశ ప్రజలు చెప్పాలి

సుప్రీం కోర్టులో ప్రధాన కోర్టు అడ్మినిస్ట్రేషన్ పద్ధతి సరిగా లేదని చెప్పారు. ప్రజలకు తెలియజేయాలనే తాము మీడియా ముందుకు వచ్చామని చెప్పారు. సుప్రీంలో పాలనా వ్యవహారాలు సరిగా సాగడం లేదన్నారు. ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలా లేదా అనేది దేశ ప్రజలు తెలియజేయాలన్నారు. ఇలాగే ఉంటే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లదని చెప్పారు.

సుప్రీం ప్రతిష్ట దెబ్బతింటోంది

సుప్రీం కోర్టు ప్రతిష్ట దెబ్బతింటోందని చెప్పారు. లోపాలను సరిదిద్దాలని తాము నలుగురం కూడా ప్రధాన న్యాయమూర్తిని కలిశామని, కానీ మా ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. అందుకే తాము బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు.

చీఫ్ జస్టిస్ వినడం లేదు, విఫలమయ్యాం, అరుదైన సంఘటన

చీఫ్ జస్టిస్ వినడం లేదు, విఫలమయ్యాం, అరుదైన సంఘటన

పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తామంటే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అంగీకరించడం లేదని వారు అన్నారు. భారత దేశ చరిత్రలో తొలిసారి జరిగిన సమావేశం ఇది అన్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఓ అరుదైన సంఘటన అన్నారు. సీజేను ఒప్పించడంలో మేం విఫలమయ్యామన్నారు. స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ లేకుంటే ప్రజాస్వామ్యం మనలేదన్నారు. ఇలాగే ఉంటే సుప్రీం పవిత్రత దెబ్బతింటుందన్నారు. ఈ రోజు ఉదయం కూడా సీజేని కలిశామని, సరిగా జరగడం లేదని వివరించామని వారు తెలిపారు. తాము ఓ ప్రత్యేక కేసు గురించి చర్చించామని చెప్పారు.

 నలుగురు జడ్జిలు వీరే, కేంద్రమంత్రికి మోడీ ఫోన్

నలుగురు జడ్జిలు వీరే, కేంద్రమంత్రికి మోడీ ఫోన్

ప్రెస్ మీట్లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ లోకూర్‌లు పాల్గొన్నారు. వీరు ఏడు పేజీల లేఖను విడుదల చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌తో ఫోన్లో మాట్లాడారు. న్యాయమూర్తుల మీడియా సమావేశంపై చర్చించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
4 judge supreme court meet press first time indian history live updates.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి