తెలంగాణ సహా రాష్ట్రాల్లో విధ్వంసానికి కుట్ర: కర్నాల్‌లో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్, భారీ పేలుడు పదార్థాలు

ఛండీగఢ్: దేశంలో ఉగ్రవాదులు మరోసారి దాడులతో అలజడి సృష్టించేందుకు కుట్రపన్నారు. అయితే, ఈ కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేశారు. దేశంలో పలు చోట్ల భారీ పేలుళ్లకు కుట్రపన్నిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆయుధాలు, పేలుడు పదార్థాలను తెలంగాణ(ఆదిలాబాద్)కు తరలించేందుకు యత్నించిన నలుగురు ఖలీస్థానీ ఉగ్రవాదులను గురువారం ఉదయం అరెస్ట్ చేసినట్లు హర్యానా పోలీసులు తెలిపారు. వీరికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో తెలంగాణ, పంజాబ్, హర్యానా పోలీసులు సంయుక్త అంతర్రాష్ట్ర ఆపరేషన్ చేపట్టారు.

4 Terror Suspects Caught With Explosives In Karnal in Haryana: reveals blasts plans in Maharashtra and Telangana

ఈ క్రమంలో హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో ఓ టోల్ ప్లాజా వద్ద అనుమానిత ఇన్నోవా ఎస్‌యూవీ పోలీసు అధికారులు గుర్తించారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా, భారీ ఎత్తున ఆయుధాలు కనిపించాయి. వీటిలో ఐఈడీలు, ఆర్డీఎక్స్, 30 కాలిబర్ పిస్టళ్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో వాహనంలోని నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.

వీరంతా పంజాబ్‌కు చెందిన ఖలీస్థానీ ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ఈ ఆయుధాలను తెలంగాణ, మహారాష్ట్రకు తరలించేందుకు తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. వీరిని విచారించడం పలు కీలక విషయాలు వెల్లడైనట్లు సమాచారం. నిందితులు ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పట్టుబడ్డారని హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ తెలిపారు. తనిఖీల్లో భాగంగా హర్యానా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.

ఈ ఆయుధాలను డ్రోన్ల ద్వారా దేశ సరిహద్దుల నుంచి తీసుకున్నట్లు ఉగ్రవాదులు తెలిపారు. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నామని నిందితులు చెప్పినట్లు సమాచారం. పాకిస్థాన్‌కు చెందిన ఖలీస్థానీ ఉగ్రవాది హర్జిందర్ సింగ్ రిండా ఈ ఆయుధాలు, పేలుడు పదార్థాలు పంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+