తుపాకీల మోతతో దద్దరిల్లిన దక్షిణ కాశ్మీర్ .. భారీ ఎన్‌కౌంటర్ లో నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ మరో మారు తుపాకుల మోతతో దద్ధరిల్లింది . జమ్ము కాశ్మీర్ లోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు రంగంలోకి దిగిన భద్రతా దళాలు, జమ్ము కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల చొరబాట్లు జరుగుతున్నట్టుగా అనుమానం ఉన్న పలు జిల్లాలలో గత కొంతకాలంగా సోదాలు నిర్వహిస్తున్నాయి.

ఇదే క్రమంలో దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు నలుగురు లష్కర్ -ఇ -తాయిబా ఉగ్రవాదులను కాల్చి చంపారని పోలీసు అధికారులు తెలిపారు.

షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ .. నలుగురు ఉగ్రమూక హతం , ఒక జవానుకు గాయాలు

షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ .. నలుగురు ఉగ్రమూక హతం , ఒక జవానుకు గాయాలు

భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అర్ధరాత్రి సమయంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురుదాడికి దిగిన భద్రతా దళం ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ భారీ ఎన్కౌంటర్ ను ఆర్మీకి చెందిన ఒక జవాన్ గాయపడ్డారని సమాచారం .

ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు మణిహాల్ ప్రాంతంలో శోధిస్తున్న తరుణంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు లొంగిపోవడానికి నిరాకరించడంతో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరా హోరీ గా ఎన్కౌంటర్ కొన్ని గంటల పాటు కొనసాగింది. ఈ రోజు తెల్లవారు జాము వరకు ఎన్ కౌంటర్ కొనసాగింది .

ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన ఉగ్రవాదులు లష్కర్ ఏ తోయిబాకు చెందిన వారు

ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన ఉగ్రవాదులు లష్కర్ ఏ తోయిబాకు చెందిన వారు

మార్చి 16 న షోపియన్‌లోని రావల్‌పోరా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఆపరేషన్ మూడు రోజుల పాటు కొనసాగింది. మృతుల్లో షోపియన్‌కు చెందిన విలాయత్ అహ్మద్ లోన్ అలియాస్ సజ్జాద్ ఆఫ్ఘని కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. షోపియన్‌లో జైష్-ఎ-మొహమ్మద్ 'కమాండర్' గా విలాయత్ అహ్మద్ పని చేశాడు. ఇక ఈరోజు ఎన్కౌంటర్ లో మృతి చెందిన ఉగ్రవాదులు లష్కర్ -ఇ -తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉగ్రవాదులకు అడ్డాగా షోపియాన్ జిల్లా .. కొనసాగుతున్న ఆపరేషన్

ఉగ్రవాదులకు అడ్డాగా షోపియాన్ జిల్లా .. కొనసాగుతున్న ఆపరేషన్


ఘటనా స్థలం నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతాదళాలు తిరిగి ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయి. దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లా చాలా కాలంగా ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఇక్కడ నిత్యం తనిఖీలు చేస్తున్న భద్రతా దళాలు ఇప్పటికే అనేక పర్యాయాలు ఉగ్రవాదులను పట్టుకోవడమే కాకుండా, ఎన్ కౌంటర్ల ద్వారా హతమార్చారు.

ఇటీవల జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతను పనిగా పెట్టుకున్న జమ్మూకాశ్మీర్ పోలీసులు ఏడుగురు ఉగ్రవాదుల నెట్ వర్క్ ను విచ్చిన్నం చేసి వారిని అరెస్ట్ చేశారు . వారి వద్ద నుండి పెద్ద ఎత్తున ఆయుధాలను మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+