ఒడిశా మృతుల్లో 40 మంది శరీరాలపై గాయాల్లేవా ? అసలేం జరిగిందీ...
ఒడిశాలోని బాలాసోర్ లో కోరమాండల్, హౌరా-బెంగళూరు ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 275 మంది మృత్యువాత పడ్డారు. కోరమాండల్, హోరా-బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారిలో వీరంతా ప్రయాణిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. అయితే 100 మృతదేహాలను ఇంకా కుటుంబాలకు అప్పగించాల్సి ఉంది.
అయితే ఈ మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించే క్రమంలో డాక్టర్లు ఓ కీలక విషయాన్ని గుర్తించారు. దాదాపు 200కు పైగా మృతదేహాల శరీరాలపై ఏదో ఒక గాయం ఉంది. వీటిలో చాలా శరీరాలపై చాలా గాయాలున్నాయి. అయితే ఓ 40 శరీరాలపై మాత్రం ఎలాంటి గాయాల్లేవు. కనీసం ఒక్క గాయం కూడా లేకుండానే వీరంతా మృత్యువాత పడినట్లు డాక్టర్లు తేల్చారు. అయితే ఇలా చనిపోవడం వెనుక ఉన్న కారణాలపై ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.

ఇందులో ఈ 40 మంది కరెంటు షాక్ వల్ల చనిపోయినట్లు నిర్ధారించారు. కరెంటు సాయంతో నడుస్తున్న రైళ్లు ప్రమాదానికి గురైన నేపథ్యంలో వీరంతా షాక్ కు గురై చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే వీరిలో చాలా మంది తాము ప్రయాణిస్తున్న బోగీల నుంచి బయటపడే క్రమంలోనూ షాక్ కు గురైనట్లు సమాచారం. ప్రాణాలు కాపాడుకునే తొందరలో మరికొందరు కరెంటు షాక్ కొట్టి చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు.
కరెంటు షాక్ కారణంగా చనిపోవడం వల్లే వీరి శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు తేల్చారు. అలాగే కరెంటు షాక్ తగిలి ఇంతమంది చనిపోవడం కూడా ఆశ్చర్యంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక్కసారిగా జరిగిన ప్రమాదం వల్ల వీరిలో కరెంటు కాకుండా సాధారణ షాక్ వల్ల కూడా చనిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని నిర్దారించేందుకు డాక్టర్లు వీరి శరీరాలకు మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications