Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లడ్డూ రాణి రూటే సపరేటు, కదులుతున్న బస్సులో అదే పని, మత్తు మందుతో లడ్డూ ప్లాన్, ప్రసాదం, దేవుడా !

చెన్నై: చోరీలు చెయ్యడానికి ఓ మహిళ మత్తు మందు కలిపిన లడ్డూలు ఇచ్చి చాకచక్యంగా రూ. లక్షలు విలువైన బంగారు నగలు చోరీ చేస్తోంది. స్వామి ప్రసాదం, అమ్మవారి ప్రసాదం తినండి, మీకు అంతా మంచే జరుగుతోందని మాయమాటలు చెబుతున్న మహిళ కదులుతున్న బస్సులో అమాయకులు మత్తులోకి జారుకోవడంతో కిలాడి లడ్డూ రాణి చిక్కనకాడికి చిక్కినంత అంటూ నగలు లూటీ చేసి మాయం అవుతోంది. ఏ మహిళ అయితే లడ్డూ రాణి చేతిలో మోసపోయిందో అదే మహిళ కిలాడి లడ్డూ రాణిని పట్టించింది.

 దోపిడీలు, చోరీలకు అనేక స్కెచ్ లు

దోపిడీలు, చోరీలకు అనేక స్కెచ్ లు

దోపిడీలు, చోరీలు చెయ్యడానికి అనేక మంది పలు స్కెచ్ లు వేస్తుంటారు. అయితే రాణి అలియాస్ లడ్డూ రాణి (40) మాత్రం చోరీలు చెయ్యడానికి లడ్డూ ప్లాన్ వేస్తోంది. ముందుగా ఇంటిలో లడ్డూలో మత్తు మందు కలుపుతున్న రాణి దానిని వెంట తీసుకెళ్లి అమాయక ప్రజలకు ఇచ్చి కుచ్చుటోపి పెడుతోంది.

 తిరుచ్చి బస్ స్టాండ్

తిరుచ్చి బస్ స్టాండ్

తంజావూరు జిల్లా తిరువైయ్యారు ప్రాంతం సమీపంలోని రంగనాథపురంలో షణ్ముగం, పార్వతి (50) దంపతులు నివాసం ఉంటున్నారు. షణ్ముగం ప్రముఖ బనియన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత జూన్ నెల 27వ తేదీన పార్వతి తిరుచ్చి సెంట్రల్ బస్ స్టాండ్ చేరుకుని పల్లడం వెళ్లడానికి బస్సు ఎక్కింది.

పార్వతికి ప్రసాదం

పార్వతికి ప్రసాదం

పార్వతి కుర్చున్న బస్సులో లడ్డూ రాణి ఎక్కింది. తరువాత పార్వతి కుర్చున్న సీటోలో కుర్చున్న లడ్డూ రాణి మీరు ఎక్కడికి వెలుతున్నారు అంటూ పార్వతిని పలకరించింది. ఇప్పుడే తాను అమ్మవారికి అభిషేకం చేసి వస్తున్నానని, మీరు ఈ ప్రసాదం తినండి అంతా మంచి జరుగుతుంది, మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయని మాయమాటలు చెప్పిన రాణి మత్తు మందు కలపని లడ్డూ కొంచెం తిన్నట్లు నటించి మత్తు మందు కలిపిన లడ్డూ ఆమెకు ఇచ్చింది.

 లడ్డూ తిన్న వెంటనే అలా మత్తులోకి !

లడ్డూ తిన్న వెంటనే అలా మత్తులోకి !

రాణి ఇచ్చిన లడ్డూ తిన్న వెంటనే పార్వతి ముఖానికి చీర కప్పుకుని మెల్లమెల్లగా స్పృహ కోల్పోయి బస్సులోని సీటులో పక్కకు వాలిపోయింది. బస్సులోని ప్రయాణికులుపార్వతి నిద్రపోతున్నదని అనుకున్నారు. అదే సమయంలో పార్వతి పక్కనే కుర్చున్న లడ్డూ రాణి లాట్స్ అనే కట్టర్ తో ఆమె మెడలోని బంగారు నగలు, కంకణాలు, ఉంగరాలు ఇలా సుమారు 8. 5 సవర్ల బంగారు నగలు చోరీ చేసింది. తరువాత వచ్చే బస్ స్టాప్ లో లడ్డూ రాణి చాకచక్యంగా బస్సు దిగి వెళ్లిపోయింది. తరువాత స్పృహలోకి వచ్చిన పార్వతి ఒంటి మీద నగలు మాయం అయిన విషయం గుర్తించి లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించింది.

పార్వతికి చిక్కిన లడ్డూ రాణి

పార్వతికి చిక్కిన లడ్డూ రాణి

గురువారం పార్వతి తిరుచ్చి నుంచి కోయంబత్తూరు (కోవై) వెళ్లడానికి బస్ స్టాండ్ దగ్గరకు భర్త షణ్ముగం, కుమారుడు సెల్వాతో కలిసి వెళ్లింది. అదే సమయంలో లడ్డూ రాణి కూడా అదే బస్ స్టాండ్ దగ్గరకు వెచ్చింది. లడ్డూ రాణిని గుర్తించిన పార్వతి ఆమె తన బంగారు నగలు లూటీ చేసిందని గుర్తించి వెంటనే భర్త షణ్ముగం, కుమారుడు సెల్వాకు విషయం చెప్పింది. పార్వతి, షణ్ముగం, సెల్వా కలిసి లడ్డూ రాణిని వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

లడ్డూ రాణికి అదే పని !

లడ్డూ రాణికి అదే పని !

పోలీసులు పార్వతి దగ్గర చోరీ చేసిన నగలను లడ్డూ రాణి నుంచి స్వాధీనం చేసుకున్నారు. లడ్డూ రాణి అనేక ప్రాంతాల్లోని బస్ స్టాండ్ లో మత్తు మందు కలిపిన లడ్డూలు మహిళలకు ఇచ్చి ఇలాగే చోరీలు చేసిందని, ఆమెను విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎన్ని చోట్ల లడ్డూ రాణి అమాయకుల దగ్గర బంగారు నగలు చోరీ చేసింది ? ఈమెకు ఎవరైనా సహకరిస్తున్నారా ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+