భర్త, కొడుకును కట్టేసి మహిళపై 10మంది గ్యాంగ్‌రేప్

40-year-old woman gang-raped by ten in Bareilly
బరేలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణాలు కొనసాగుతున్నాయని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా, తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ(40)పై పది మంది సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి దళిత వర్గానికి చెందిన కుటుంబం పొలం పనులు ముగించుకుని వస్తుండగా పొదల్లో దాక్కొని ఉన్న పది మంది దుండగులు వారిపై ఒక్కసారిగా దాడి చేశారు.

ప్రతిఘటించిన బాధితురాలి భర్త, కుమారుడిని కట్టి పడేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పది మంది నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్పి రవీంద్ర గౌడ్ తెలిపారు.

వైద్య పరీక్షల నిమిత్తం బాధిత మహిళను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆమె అత్యాచారానికి గురైనట్లు వైద్య నివేదిక వెల్లడించిందని తెలిపారు. ఘటనపై సమాచారం అందినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోని కంటోన్మెంట్ పోలీసులపై చర్య తీసుకుంటామని ఎస్పి వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+