ఎస్‌వైఎల్ వివాదం: 45మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా
చండీగఢ్: సట్లెజ్ యమునా లింక్(ఎస్‌వైఎల్) వివాదం పంజాబ్‌లో రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఎస్‌వైఎల్ కెనాల్ వినియోగంపై సుప్రీంకోర్టు హర్యానాకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో పంజాబ్‌లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేందరూ రాజీనామా చేశారు.
ప్రతిపక్ష నేత చంద్రజీత్ సింగ్‌తో సహా 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం స్పీకర్‌కు రాజీనామా పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యేల వెంట సీనియర్ నేతలు అమరీందర్ సింగ్, అంబికా సోనీ, ప్రతాప్ సింగ్ బజ్వా తదితరులు ఉన్నారు.

ఈ విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌పై విమర్శలు చేశారు. ప్రజల ఆసక్తులను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆదివారం కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు.
అయితే, స్పీకర్ ఆ ఎమ్మెల్యేల రాజీనామాలను ఇంకా అంగీకరించలేదు. అమరీందర్ ఇప్పటికే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. పంజాబ్ ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన 'పంజాబ్ టర్మినేషన్ ఆఫ్ అగ్రిమెంట్స్' చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. హర్యానా హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, ఢిల్లీ, చండీగఢ్‌లకు నీటి పంపకం విషయంలో పంజాబ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications