మోదీ మార్క్ రివేంజ్- సర్జికల్ స్ట్రైక్స్ కు మించి, కౌంట్ డౌన్..!!
జమ్ము కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తో కేంద్రం అప్రమతమతైంది. ప్రధాని మోదీ సౌదీ టూర్ రద్దు చేసుకొని ఢిల్లీ వస్తూనే కీలక భేటీలు నిర్వహించారు. దాడి వెనుక శక్తులు.. జమ్మూలో తాజా పరిస్థితుల పైన సమీక్ష చేసారు. ప్రతీకారం తప్పదని కేంద్రం హెచ్చరించింది. ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో సమాధానం ఉంటుందని రాజ్ నాధ్ సింగ్ తేల్చి చెప్పారు. భారత ను ఎవరూ భయపెట్టలేరని స్పష్టం చేసారు. గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కు మించి ఈ సారి సమాధానం ఇచ్చేలా రంగం సిద్దం అవుతున్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
మోదీ వరుస సమీక్షలు
కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి పై కేంద్రం సీరియస్ గా ఉంది. ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహా దారు అజిత్ డోవల్ తో నిరంతరం సమీక్ష చేస్తున్నారు. అటు అమిత్ షా ఘటన జరిగిన ప్రాంతం లో బాధితులను పరామర్శించారు. ఘటనకు కారకులను వదిలేది లేదని హెచ్చరించారు. రక్షణ మంత్రి రాజ నాధ్ సింగ్ త్రివిధ దళాలతో సమావేశం అయ్యారు. ఈ సాయంత్రం మంత్రివర్గ ప్రత్యేక భేటీకి నిర్ణయించారు. ఘటన జరిగిన తీరు.. వెనుక ఎవరు ఉన్నారనే సమాచారం గురించి మంత్రివర్గంలో వివరించనున్నారు. అటు సరిహద్దుల్లో పాక్ తమ సైన్యాన్ని పెంచటం పైనా భారత్ నిశితంగా గమనిస్తోంది. అటు ప్రపంచ దేశాలు ఉగ్రదాడిని ఖండించాయి. భారత్ కు బాసటగా నిలిచాయి.

42 ఉగ్రవాద శిబిరాలు
ఇక, ఈ ఘటనకు సరైన తీరులో సమాధానం చెప్పాలని కేంద్రం డిసైడ్ అయింది. గతంలో పీఓకే లో సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మోదీ టీం.. ఈ సారి అంతకంటే గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తోంది. ఇందు కోసం అధునాతన సాంకేతికతను వినియోగించుకోనున్నట్ల తెలుస్తోంది. ఇప్పటికీ ఇంకా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 42 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి నియంత్రణ రేఖకు సమీపంలోనే ఉన్నట్లు నిఘా వర్గాలు తాజాగా గణాంకాలు విడుదల చేశాయి. అందులో వందల సంఖ్యలో ముష్కరులు శిక్షణ పొందుతున్నట్లు సమాచారం.ఈ ఉగ్రవాద శిక్షణా కేంద్రాల్లో 115 నుంచి 130 మంది ఉగ్రవాదులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందులో 115 మంది పాకిస్థాన్ జాతీయులని నిర్ధారణకు వచ్చారు.
సీరియస్ వార్నింగ్స్
కశ్మీర్ లోయలో 70నుంచి 75 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నట్లు సమాచారం. 60 నుంచి 65 మంది జమ్ము, రాజౌరీ, పూంచ్ రీజియన్లలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని భద్రతాసంస్థలు వెల్లడించాయి. వారిలో అత్యధికంగా లష్కరే తొయిబా ముఠా సభ్యులే ఉన్నట్లు పేర్కొన్నాయి. అందులో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే తొయిబా, ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందినవారు ఉన్నారు. మరో 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, వీరి శిబిరాలను పూర్తిగా తుది ముట్టించేలా ప్రధాని మోదీ సంచలన నిర్ణయానికి సిద్దం అవుతున్నట్లుగా ఢిల్లీలో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications