వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

18 ఏళ్ళ యువకుడితో 42 ఏళ్ళ నర్సు సహజీవనం: షాకిచ్చిన మహిళా కమిషన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: 18 ఏళ్ళ యువకుడితో 42 మహిళ సహజీవనం చేసిన ఘటన కేరళలో కలకలం రేపుతోంది.అయితే ఈ వ్యవహరం కేరళ మహిళా కమిషన్ దృష్టికి రావడంతో ఘటన వెలుగు చూసింది. డబ్బుతో పాటు ఇతర ఆశలను కల్పించి తన కొడుకును మహిళ బుట్టలో వేసుకొందని యువకుడి తల్లి ఆరోపిస్తోంది.

స్నానం చేస్తోంటే వీడియో తీసి అత్యాచారం, వేధింపులతో బాధితురాలిలా..స్నానం చేస్తోంటే వీడియో తీసి అత్యాచారం, వేధింపులతో బాధితురాలిలా..

కేరళ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ ఘటన పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. సౌదీలో నర్సుగా పనిచేసే 42 ఏళ్ళ మహిళకు ఫేస్‌బుక్ ద్వారా కేరళకు చెందిన 18 ఏళ్ళ యువకుడు పరిచయమయ్యాడు.

షాక్: బంధించి రేప్, ఆశ్రమంలో గురువులపై నలుగురు సాధ్వీల ఫిర్యాదుషాక్: బంధించి రేప్, ఆశ్రమంలో గురువులపై నలుగురు సాధ్వీల ఫిర్యాదు

అయితే ఆ మహిళ సౌదీ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆ యువకుడితో సహజీవనం ప్రారంభించింది. అయితే యువకుడి కుటుంబ ఆర్థిక పరిస్థితులు, బలహీనతలను ఆసరాగా చేసుకొని ఆమె తన కొడుకు లోబర్చుకొందని యువకుడి తల్లి ఆరోపిస్తోంది.

ఫేస్‌బుక్ ఫ్రెండ్: యువతిని నమ్మించి అత్యాచారం, ఫోటోలతో బ్లాక్‌మెయిల్ఫేస్‌బుక్ ఫ్రెండ్: యువతిని నమ్మించి అత్యాచారం, ఫోటోలతో బ్లాక్‌మెయిల్

 18 ఏళ్ళ కుర్రాడితో 42 ఏళ్ళ మహిళా సహజీవనం

18 ఏళ్ళ కుర్రాడితో 42 ఏళ్ళ మహిళా సహజీవనం

కేరళలోని పథినంతిట్ట జిల్లా కేంద్రానికి చెందిన 18 ఏళ్ళ యువకుడికి ఫేస్‌బుక్ ద్వారా 42 ఏళ్ళ మహిళ పరిచయమైంది. ఈ పరిచయమైన సమయంలో ఆ మహిళ సౌదీలో నర్సుగా పనిచేసేది. అయితే మొబైల్ ఫోన్, బైక్‌ను ఆశగా చూపిన మహిళా ఆ యువకుడిని ముగ్గులోకి దింపిందని యువకుడి తల్లి ఆరోపణలు చేస్తోంది. సౌదీ నుండి తిరిగి రాగానే ఆ మహిళా యువకుడిని తీసుకెళ్ళి బెంగుళూరులో నివసిస్తోంది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఆరు మాసాల నుండి బెంగుళూరులోనే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని యువకుడి తల్లి చెబుతోంది.

సహజీవనానికి బ్రేకప్

సహజీవనానికి బ్రేకప్

ఆరు మాసాల సహజీవనానికి మధ్య బ్రేక్ పడింది. ఆరు మాసాల పాటు ఇద్దరి మధ్య సంబంధం బాగానే ఉంది. అయితే ఆరు మాసాల తర్వాత యువకుడు తన తల్లిదండ్రులను కలిసే ప్రయత్నం చేయడంతో సహజీవనానికి బ్రేకప్ అయింది. యువకుడిని ఆ మహిళా తీవ్రంగా ఇబ్బందులు పెట్టిందని యువకుడి తల్లి ఆరోపించిందిత.

 కేసులు పెట్టి జైలుకు పంపిన మహిళ

కేసులు పెట్టి జైలుకు పంపిన మహిళ

తల్లిదండ్రులను యువకుడు కలిసే ప్రయత్నం చేయడంతో మహిళ తన విశ్వరూపాన్ని చూపింది. తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలంటూ ఆ మహిళా.. వేధింపులు మొదలు పెట్టింది. యువకుడి మీద క్రిమినల్‌ కేసులు పెట్టి.. మూడు నెలల పాటు జైలుకు పంపింది. అయితే కొడుకును విడిపించుకొనేందుకు బాధిత యువకుడి తల్లిదండ్రులు ఆస్తిని తనఖా పెట్టారు.

మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన నర్స్

మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన నర్స్

తన డబ్బులు చెల్లించాలంటూ కేరళ మహిళా కమిషన్‌ను నర్సు ఆశ్రయించింది. రూ.43 వేల అసలుతో పాటూ వడ్డీ కూడా చెల్లించాలని ఆమె డిమాండ్‌ చేసింది. ఈ ఘటనపై మహిళా కమిషన్‌ విచారణ జరిపింది. నర్సుకు దిమ్మతిరిగేలా తీర్పు చెప్పింది.యువకుడు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని కమిషన్‌ ప్రకటించింది.

 చెడు అలవాట్లు నేర్పిన నర్సు

చెడు అలవాట్లు నేర్పిన నర్సు

తన కొడుకుకు నర్సు చెడు అలవాట్లను నేర్పిందని యువకుడి తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు.మద్యం, సహా ఇతర దురలవాట్లను నర్సు అలవాటు చేసిందని యువకుడి తల్లిదండ్రులు మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళారు.డబ్బు, శృంగారాన్ని ఎరగా వేసి తన కొడుకు జీవితాన్ని నాశనం చేశారని యువకుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

English summary
A 42-year-old home nurse who was in a live-in relationship with a minor boy has approached the Kerala women's commission to re claim the money she had gifted him before they fell out.she wants the boy now legally major. 1
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X