వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ రహస్య పత్రాల లీకు: ఇద్దరు అధికారులు సహా 5గురి అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య పత్రాలను లీక్ చేసిన కేసులో అయిదుగురు అరెస్టయ్యారు. వారిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. రహస్య పత్రాలను లీక్ చేసిన కేసులో.. అరెస్టైన వారిలో పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు.

పోలీసులు మరో జర్నలిస్ట్‌ను ఇందుకు సంబంధించిన కేసులో విచారిస్తున్నారని తెలుస్తోంది. కార్పోరేట్ పెద్దలకు ఈ రహస్య పత్రాలను అందచేయాలన్నది వారి పథకంగా ఉందని సమాచారం.

5 arrested for leaking govt documents

నిందితులు అయిదుగురు కూడా ఆ డాక్యుమెంట్లను బిజినెస్‌మెన్‌లకు ఇవ్వాలని చూశారు. ఈ పత్రాల ద్వారా ప్రభుత్వ విధాన నిర్ణయాలను ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలని చూశారు.

అరెస్టైన వారిలో ఇద్దరు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియంకు చెందిన అధికారులు, మరో ఇద్దరు మీడియేటర్లు ఉన్నారు. కాగా, దిగుమతులతో పాటు ధరల నిర్ణయానికి సంబంధించిన విధాన నిర్ణయాలు ఈ పత్రాల్లో ఉన్నాయని సమాచారం. పోలీసులు వారి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పత్రాల లీక్ పైన కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.

English summary
Five persons have been arrested by the Delhi crime branch on charges of leaking sensitive government documents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X