షాకింగ్: ఢిల్లీలో ప్రతిరోజు 5గురు చిన్నారుల అదృశ్యం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చిన్నారుల అదృశ్యం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ప్రతిరోజు ఐదుగురు చిన్నారులు కనిపించకుండా పోతున్నారు. గత ఐదేళ్లలో ఇప్పటి వరకు 8,470 మంది పిల్లలు అదృశ్యమైనట్లు ఢిల్లీ పోలీసుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
అదృశ్యమైన వారిలో 4,620 మంది బాలురు కాగా, 2,665 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 1,800 మందిని గుర్తించినట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. ఇంకా 600 మంది బాలికల ఆచూకీ లభ్యం కాలేదు. కిడ్నాపైన వారందరూ 12ఏళ్ల లోపువారే కావడం గమనార్హం.

‘పిల్లలందరూ ఇళ్లల్లో ఆశ్రయం పొందడం లేదు. నగరంలో అనేక మానవ రవాణా రాకెట్లు ఉనికిలో ఉన్నాయి. కిడ్నాపర్లు బాలురను తినుబండారాల దుకాణాల్లో, పొలాల్లో, ఇళ్లల్లో పనిచేయడానికి విక్రయిస్తున్నారు. బాలికలను వ్యభిచార కూపంలో నెడుతున్నారు' అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
కల్తీ మద్యం తాగి ఏడుగురి మృతి
పశ్చిమబెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఏడుగురు మరణించారు. మరో 100 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.












Click it and Unblock the Notifications