ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం...ఐదుగురు మృతి,పలువురికి గాయాలు

ఉత్తరప్రదేశ్:ఉత్తర్‌ప్రదేశ్‌ రాయ్ బరేలిలో రైలు ప్రమాదం సంభవించింది. రాయ్‌బరేలి జిల్లా హర్‌చంద్‌పూర్‌ సమీపంలో న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు ఈరోజు ఉదయం పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా...పలువురు గాయపడ్డారు.

ప్రమాద సమాచారం తెలియగానే లఖ్‌నవూ, వారణాసి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లాయి. రైలు ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. దీనికి సంబంధించి మొఘల్ సాయిలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ వద్ద అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.

5 Dead, Several Injured After Train Derails In Uttar Pradesh Raebareli

ప్రమాదం చోటుచేసుకున్న మార్గంలో అన్ని రైళ్లని నిలిపివేశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+