వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. పశ్చిమ్‌బంగా, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి కూడా ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీం జైదీ శుక్రవారం వెల్లడించారు.

ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. మొత్తం 5 రాష్ట్రాల్లో 1,070 మిలియన్ల ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అస్సాంలో 126, తమిళనాడులో 234, బంగాల్‌లో 294, కేరళలో 140, పుదుచ్చేరిలో 30శాసనసభా స్థానాలకు ఎన్నికల నిర్వహించనున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి 824 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.

కేరళలో 21వేలు, తమిళనాడులో 65వేలు, పశ్చిమ బెంగాల్‌లో 77వేలు, పుదుచ్చేరిలో 913 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఉంటాయని జైదీ తెలిపారు. అన్నిచోట్లా ఈవీఎంలనే ఉపయోగిస్తామని అన్నారు. నోటాకు కూడా ప్రత్యేక గుర్తును ఈ ఎన్నికల నుంచి కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు.

64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ఈవీఎంలకు ప్రింటర్లు జతచేస్తున్నామని అన్నారు. అభ్యర్థులందరి ఫొటోలను కూడా ఈవీఎంలలో ఉంచుతామని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

అస్సాంలో 2 దశలలోనూ, పశ్చిమబెంగాల్‌లో 6 దశలలోను, మిగిలిన మూడు రాష్ట్రాలు.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒకే దశలోను ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన మే 19వ తేదీన ఉంటాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ మే 21 నాటికి ముగుస్తుందని నసీం జైదీ ప్రకటించారు.

5 states assembly election dates announced; poll results to be declared on May 19

షెడ్యూల్ వివరాలు:

అసోం తొలి దశ 65 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: మార్చి 11
నామినేషన్ల ముగింపు తేదీ: 18 మార్చి
నామినేషన్ల పరిశీలన: 19 మార్చి
ఉపసంహరణ గడువు: 21 మార్చి
పోలింగ్ తేదీ: 4 ఏప్రిల్ (సోమవారం)

రెండోదశ 61 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: మార్చి 14
నామినేషన్ల ముగింపు తేదీ: 21 మార్చి
నామినేషన్ల పరిశీలన: 22 మార్చి
ఉపసంహరణ గడువు: 26 మార్చి
పోలింగ్ తేదీ: 11 ఏప్రిల్ (సోమవారం)

పశ్చిమబెంగాల్ తొలి దశ 18 నియోజకవర్గాలు(రెండుసార్లుగా జరుగుతుంది)
నోటిఫికేషన్ జారీ: 11 మార్చి, 21 మార్చి
నామినేషన్ల ముగింపు తేదీ: 18 మార్చి, 22 మార్చి
నామినేషన్ల పరిశీలన: 19 మార్చి, 26 మార్చి
పోలింగ్ తేదీలు: 4 ఏప్రిల్, 11 ఏప్రిల్

రెండోదశ 56 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: 22 మార్చి
నామినేషన్ల ముగింపు తేదీ: 29 మార్చి
నామినేషన్ల పరిశీలన: 30 మార్చి
ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 1
పోలింగ్ తేదీ: 17 ఏప్రిల్

మూడోదశ 62 నియోకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: 28 మార్చి
నామినేషన్ల ముగింపు తేదీ: 4 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 5 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 7 ఏప్రిల్
పోలింగ్ తేదీ: 21 ఏప్రిల్

నాలుగోదశ 49 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 1
నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 4
నామినేషన్ల పరిశీలన: 9 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 11 ఏప్రిల్
పోలింగ్ తేదీ: 25 ఏప్రిల్

ఐదోదశ 53 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 4
నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 11
నామినేషన్ల పరిశీలన: 12 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 16 ఏప్రిల్
పోలింగ్ తేదీ: 30 ఏప్రిల్

ఆరోదశ 25 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 11
నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 18
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 19
ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 21
పోలింగ్ తేదీ: మే 5

కేరళ 140 నియోజకవర్గాలు
ఒకేదశ నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్
నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 2 మే
పోలింగ్ తేదీ: 16 మే

తమిళనాడు 234 నియోజకవర్గాలు
ఒకే దశ నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్
నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 2 మే
పోలింగ్ తేదీ: 16 మే

పుదుచ్చేరి 30 నియోజకవర్గాలు

ఒకేదశ నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్
నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 2 మే
పోలింగ్ తేదీ: 16 మే

ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీ: మే 19.

English summary
The Election Commission on Friday announced the dates of polling in four states and Union Territory of Puducherry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X