వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో 50వేల ఉద్యోగాల భర్తీ.. త్వరలో ప్రకటన : గవర్నర్ సత్యపాల్ మాలిక్

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌లో 50వేల ఉద్యోగాలను భర్తి చేస్తామని జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. అదికూడ రెండు లేదా మూడు నెలల్లోనే భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యోగాలను జేజిక్కుంచుకునే యువత సిద్దంగా ఉండాలని, ఇందుకోసం అవసరమైన శక్థి సామర్థ్యాలను కూడగట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అక్గోబర్ 31 నుండి పూర్తిస్థాయి కేంద్రపాలిత ప్రాంతాలుగా మారనున్న నేపథ్యంలోనే కేంద్రం దృష్టి సారించింది. అప్పటిలోగా స్థానిక ప్రసన్నం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది.

 యువత టార్గెట్,

యువత టార్గెట్,

జమ్ము కశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని ప్రధాని మోడీ తోపాటు పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రహుం శాఖ సహాయ మంత్రి అమిత్ షాలు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే రెండు కేంద్ర పాలితా ప్రాంతాల అభివృద్దికి కేంద్రం పలు చర్యలు చేపట్టింది. జమ్ము కశ్మీర్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేసిన కేంద్రం ఇప్పుడు వాటిని అమల్లో పెట్టేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే ఆర్ధిక వెనకబాటు తనంతో ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్న యువతను కేంద్రం టార్గెట్ చేసుకుంది.

ఆర్మీ ,నేవీల్లో కశ్మీర్ యువతకు ఉద్యోగాలు

ఆర్మీ ,నేవీల్లో కశ్మీర్ యువతకు ఉద్యోగాలు

370 ఆర్టికల్ రద్దు తర్వాత యువతో నిరసన జ్వాలలు చెలరేగకుండా వారిపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే ప్రకటనను చేయనున్నట్టు సమచారం. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల్లో యువతను ప్రోత్సహించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆర్మీ, పారమిలటరీని దళాల్లో కశ్మీర్ యువతకు పెద్ద పీట వేసేందుకు ఆయా విభాగాలను కూడ కేంద్రం కోరనుంది. దీంతో పాటు పర్యటక రంగానికి కూడ పెద్ద పీట వేయనున్నారు.

 కశ్మీర్‌లో పర్యటిస్తున్న హైలెవల్ కమిటీ..

కశ్మీర్‌లో పర్యటిస్తున్న హైలెవల్ కమిటీ..

ఇప్పటికే కశ్మీర్‌‌లో ప్రాజెక్టులను నిర్మించేందుకు కావాల్సిన అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో ప్రతినిధి బృందం కశ్మీర్‌లో పర్యటిస్తోంది. ఈ బృందంలో ప్రభుత్వ సెక్రటరీలతోపాటు అత్యున్నత స్థాయి సభ్యులు ఉన్నారు. పరిశ్రమలతో పాటు అభివృద్దికి కావాల్సిన ఏర్పాట్లను కూడ కమిటి పరీశీలించనుంది. ఇందులో భాగంగానే విద్యాసంస్థలను ఏర్పాటును కూడ పరీశీంచనుంది. విద్యకు సంబంధించి మరిన్ని యూనివర్శిటిలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇదివరకే హమీ ఇచ్చింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ కూడ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

English summary
Jammu and Kashmir Governor Satya Pal Malik said that the administration will fill up vacancies in 50,000 government jobs over the next two to three months. "We will appeal to the youth to get involved with full vigour, in the coming two to three months we will fill these positions," he said at a press conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X