50 కోట్ల డ్రగ్స్ స్వాధీనం: గోవాకు తరలిస్తున్న కిలాడి కానిస్టేబుల్ అరెస్టు
ముంబై: మహారాష్ట్రలో రెండుచోట్ల రూ.50 కోట్ల విలువైన 467 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న ముంబై కిలాడి కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
మహారాష్టలోని దాతార జిల్లాలోని కన్నేర్ అనే గ్రామంలోని ఇంటిలో డ్రగ్స్ నిల్వ చేశారని అధికారులకు సమాచారం అందింది. బుధవారం ఇంటి మీద దాడి చేసిన పోలీసులు 112 కేజీల డ్రగ్స్ స్వాదీనం చేసుకున్నారు. ఇదే సమయంలో కానిస్టేబుల్ ధరమ్ రాజ్ ఖలోక్ అనే కానిస్టేబుల్‌ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
ధరమ్ రాజ్ ముంబైలోని మేరిన్ డ్రైన్ పోలీస్ స్టేషన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. మా నాన్న మరణించాడని అంత్యక్రియలు నిర్వహించడానికి వెళ్తున్నానని తనకు మూడు రోజులు సెలవు కావాలని పై అధికారులను నమ్మించాడు. తరువాత కన్నేర్ గ్రామంలోని ఇంటిలో డ్రగ్స్‌ను చిన్న చిన్న బ్యాగ్‌లలో నింపి గోవాకు తరలించడానికి ప్రయత్నించాడు.

గోవాలో ఇతను మాదం పటేల్ అనే వ్యక్తికి డ్రగ్స్ అందించడానికి బయలుదేరాడని పోలీసులు తెలిపారు. మాదం పటేల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్వాదీనం చేసుకున్న డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకు వచ్చారు, కానిస్టేబుల్‌కు ఎవరు డ్రగ్స్ ఇచ్చారు అని ఆరా తీస్తున్నారు.
ముంబైలో ప్రసిద్ది చెందిన కోండోస్కర్ ట్రావెల్స్‌కు చెందిన ముగ్గురిని పోలీసు అధికారులు అరెస్టు చేశారు. వీరి నుండి 355 కేజీల డ్రగ్స్ స్వాదీనం చేసుకున్నారు. ముంబై - పూణె జాతీయ రహదారిలో ఒక వాహనంలో డ్రగ్స్ తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో అక్కడిక వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన ముగ్గురు సోదరులు వారి సొంత ఎరువుల ఫ్యాక్టరి నుండి హెరాయిన్‌ను ప్రత్యేక వాహనంలో తరలిస్తున్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications