వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్తార్‌పూర్ కారిడార్: తొలిరోజు ఎంతమంది యాత్రికులు వెళ్లారంటే.. జాబితాలో ప్రముఖులు కూడా..

|
Google Oneindia TeluguNews

కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమైన తొలిరోజు యాత్రికులు వందల సంఖ్యలో వెళ్లారు. పంజాబ్ సరిహద్దులో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరై కారిడార్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మాజీ ప్రకాశ్ సింగ్ బాదల్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

562 మంది

562 మంది

కారిడార్ ప్రారంభోత్సవం రోజున 562 మంది యాత్రికులు భారతదేశం నుంచి వెళ్లారు . ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. కర్తార్ పూర్ వద్ద గల గురుద్వారా వద్ద ప్రార్తనలు చేశారు. 4 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కారిడార్ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ బాబా నానక్ డేరా నుంచి పాకిస్థాన్‌లోని గురుద్వారాను కలుపుతుుంది. దానిని శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇదీ ఒప్పందం

ఇదీ ఒప్పందం

562 జతలు కారిడార్ ద్వారా వెళ్లినట్టు కేంద్ర హోంశాఖ అధికారులు పేర్కొన్నారు. పాకిస్థాన్ లోని నరోవల్ జిల్లాలో గల గురుద్వారాను దర్శించుకున్న అనంతరం భక్తులు తిరిగి భారత్ వచ్చేస్తారు. దీనిపై పాకిస్తాన్ తో భారత్ ఒప్పందం చేసుకుంది.

ప్రముఖులు..

ప్రముఖులు..

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అతని భార్య గుర్‌శరణ్ కౌర్, పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, కేంద్రమంత్రి హర్దిప్ పూరి, సోమ్ ప్రకాశ్ కూడా వెళతారు.. వీరితోపాటు మాజీ పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, అతని కుమారుడు శిరోమణి అకాళీదల్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ దాల్, కోడలు కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కూడా వెళతారు.

 ధన్యావాదాలు.. ఇమ్రాన్

ధన్యావాదాలు.. ఇమ్రాన్


భారతీయుల మనోభావాలను గౌరవించిన పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు మోడీ ధన్యవాదాలు తెలిపారు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా గురుదాస్ పూర్ డేరా బాబా నానక్ వద్ద కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించారు. అంతకుముందు గురునానక్ జయంతి సందర్భంగా స్మారక నాణెం కూడా ఆవిష్కరించారు.

స్నేహ హస్తం..

స్నేహ హస్తం..

పాకిస్థాన్‌తో మంచి సంబంధాలను కోరుకుంటున్నామని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదం, ముష్కరులను పాకిస్థాన్ పెంచి పోషించడం సరికాదని మండిపడ్డారు. ప్రస్తుత సమయంలో మనం పంచాల్సింది ప్రేమనే తప్ప.. ద్వేషాన్ని కాదని స్పష్టంచేశారు. ఉగ్రవాద చర్యలను ఆపివేసి.. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని కోరారు. అభివృద్ధిపై ఫోకస్ చేస్తే సమాజానికి మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

English summary
562 pilgrims visited first day of kartarpur corrider. they offer to prayers at gurudwara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X