కరోనా కలకలం - ఆరు వేలకు పైగా కేసులు, కొత్త టెన్షన్..!!

దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 6,050 కేసులు నమోదయ్యాయి. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం. గతేడాది సెప్టెంబర్‌ 16న 6,298 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బాధితు సంఖ్య 4,47,51,259కి చేరింది. ఇందులో 5,30,954 మంది మరణించారు. ప్రస్తుతం 31,194 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 11 మరణాలు నమోదయ్యాయి. కేసుల పెరుగుదల పైన కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

కేసుల సంఖ్య పెరుగున్న పరిస్థితుల్లో కేంద్ర కేసుల తీవ్రత పైన ఫోకస్ చేసింది. మొత్తం కేసుల్లో 0.07 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, 98.74 శాతం మంది కోలుకున్నారు. 1.19 శాతం మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63 శాతానికి పెరిగాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

 corona

ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యం, తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌ కేసుల వ్యాప్తిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. వైరస్‌ వ్యాపిస్తున్న ప్రాంతాలను (ఎమర్జెన్సీ హాట్‌స్పాట్స్‌) గుర్తించి... దాని కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వైరస్‌ బాధితులకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో సౌకర్యాలపై ఈ నెల 10, 11 తేదీల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాల్లోని అధికార యంత్రాంగాలు, ఆరోగ్య శాఖ అధికారులతో ఈ నెల 8, 9 తేదీల్లో వైద్య సదుపాయాల సన్నద్ధతపై సమీక్షించాలని ఆరోగ్య శాఖ మంత్రులను కోరారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను పెంచడంతో పాటు ప్రజల్లో కొవిడ్‌ నియంత్రణ చర్యలపై అవగాహనను మరింతగా పెంచాలన్నారు.

కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల సంఖ్యను పెంచాలని, అవసరమైన వారందరికీ టీకాలు అందజేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 88,503గా నమోదైంది. ప్రస్తుతం వ్యాధి విస్తరణకు కారణమవుతున్నాయని భావిస్తున్న వేరియంట్లు...ఎక్స్‌బీబీ.1.5, బీక్యూ.1, బీఏ.2.75, సీహెచ్‌.1.1, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీఎఫ్‌, ఎక్స్‌బీబీ.1.16లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరంతర నిఘా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పెరుగుదలకు 'ఎక్స్‌బీబీ 1.16' లేదంటే, 'ఆర్ట్కురుస్‌'గా పిలిచే కొత్త వేరియంటే కారణం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత వేరియంట్లలో లేని కొన్ని లక్షణాలను ఇందులో గుర్తించినట్టు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+