ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఎగుమతి కార్లకేనా? పేదల ప్రాణాలు పట్టవా?: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం కార్ల తయారీదారులకు కీలక ప్రశ్న సంధించారు. ఆయన ఎకానమీ కార్ల తయారీదారులను ప్రశ్నిస్తూ..ఎగుమతి చేసే కార్లలలో ఆరు ఎయిర్ బ్యాగ్‌లను ఉంచుతున్నారని.. అయితే, స్థానికుల కోసం మాత్రం వాటిని తయారుచేసేటప్పుడు నాలుగు మాత్రమే ఉంచారని అన్నారు.
పేదల జీవితాలు రక్షించబడటానికి అర్హమైనవి కావా? అని నితిన్ గడ్కరీ కార్ల తయారీదారులను ప్రశ్నించారు. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) సోమవారం నిర్వహించిన ఒక ఈవెంట్‌లో భాగంగా ఇండియా టుడే న్యూస్ డైరెక్టర్ రాహుల్ కన్వాల్‌తో గడ్కరీ మాట్లాడారు.

ఎయిర్‌బ్యాగ్‌ల సంఖ్యను పెంచడం వల్ల వాహనం ధరపై గణనీయమైన ప్రభావం చూపుతుందని ఎకానమీ కార్ల తయారీదారులు చెబుతున్న వాదన మోసపూరితమైనదని నితిన్ గడ్కరీ అన్నారు. వాహనంలో ఒక ఎయిర్‌బ్యాగ్‌ను పెంచడానికి అయ్యే ఖర్చు రూ.900 వరకు ఉంటుందని ఆయన తెలిపారు.
వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరిగా అమర్చే ప్రక్రియ ఇప్పటికే అమలులో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతికి కారణమైన రోడ్డు ప్రమాదంపై గడ్కరీ మాట్లాడుతూ.. అహ్మదాబాద్-ముంబై హైవేపై ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందని, హైవే చాలా ప్రమాదకరంగా ఉందని అన్నారు.
తాను మహారాష్ట్రలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యుడీ) మంత్రిగా ఉన్న సమయంలో సైరస్ మిస్త్రీ ప్రమాదానికి గురైన హైవేని తాను పూర్తి చేశానని గడ్కరీ చెప్పారు.
రోడ్డు ప్రమాదాలపై గడ్కరీ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్డు నెట్‌వర్క్‌గా భారత్ ఉన్నప్పటికీ ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాల వల్ల 1,50,000 మరణాలు సంభవిస్తున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇందులో 65 శాతం మరణాలు 18-34 ఏళ్ల మధ్య ఉన్నవారేనని చెప్పారు.
2024 చివరి నాటికి దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించాలని కోరుకుంటున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ లక్ష్యం కోసం ఇప్పటికే పనులు ప్రారంభించామని, అంతర్జాతీయ రహదారి భద్రత వ్యవస్థలను అనుసరించడంలో రాజీపడబోమని ఆయన అన్నారు. "ప్రాముఖ్యమైనది ప్రాణాలను కాపాడటం" రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా అధికారులు వినూత్న మార్గాలను చర్చిస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications