పిల్లాడిని తప్పించబోయి చెరువలో పడిన కారు: ఆరుగురు చిన్నారుల మృతి

పాట్నా: బీహార్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ పిల్లాడిని కాపాడేందుకు డ్రైవర్ చేసిన ప్రయత్నం ఆరుగురు చిన్నారులను బలితీసుంది. మంగళవారం ఉదయం అరారియా జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది.

ప్రమాదానికి గురైన స్కార్పియో కారులో చిన్నారులతో పాటు మరో నలుగురు పెద్దలు కూడా ఉన్నారు. బాధితులంతా ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

6 children die in Bihar’s Araria after car falls into pond

దబ్రా గ్రామం సమీపంలోకి రాగానే ఓ చెట్టును ఢీకొట్టడంతో కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు నేరుగా ఓ చెరువులో పడిపోయింది. మొత్తం ఆరుగురు పిల్లలు అక్కడికక్కడే చనిపోగా... మిగతా వారిని హుటాహుటిన ఆరారియాలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు దాటుతున్న ఓ పిల్లాడిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడనీ.. అయితే కారు రోడ్డుపక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో నియంత్రణ కోల్పోయాడని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+