రేప్ చేసి బాలికను చంపేసి వంట పాత్రలో శవాన్ని కుక్కాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ దుర్మార్గుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను గొంతు నులిమి చంపేసి శవాన్ని వంటపాత్రలో కుక్కాడు. తమిళనాడులోని సేలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

శవం ఉన్న పాత్ర అత్యాచారం చేశాడని అనుమానిస్తున్న వ్యక్తి ఇంట్లో లభించింది. నిందితుడిగా అనుమానిస్తన్న టీనేజర్ మృతురాలి ఇంటి పక్కనే నివసిస్తాడు. అతన్ని అరెస్టు చేశారు. 17 ఏళ్ల నిందితుడు బడి మానేసి రికామీగా తిరుగుతున్నట్లు చెబుతున్నారు.

6-Year-Old Raped, Strangled And Stuffed In Cooking Vessel In Tamil Nadu

స్వీట్లు ఇస్తానని బాలికను నమ్మించి తన ఇంట్లోకి పిలిచి అతను దారుణానికి ఒడిగట్టాడు. తాను చేసిన పనికి భయపడి గొంతు నులిమి బాలికను హత్య చేశాడు. శవాన్ని భారీ వంటపాత్రలో కుక్కి, దానిపై మూత పెట్టి తన ఇంట్లోని పూజ గదిలో పెట్టాడు.

శనివారం నుంచి కనిపించకుండా పోయిన తన కూతురి కోసం మృతురాలి తండ్రి ఆదివారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీనేజర్‌తో బాలిక వెళ్లిన విషయాన్ని స్థానికులు తాము గమనించినట్లు చెప్పారు. పోలీసులు వెళ్లగానే ఇంటి నుంచి పారిపోవడానికి బాధితుడు ప్రయత్నించాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A six-year-old girl was raped, strangled and stuffed in a cooking vessel, allegedly by a neighbour in Tamil Nadu's Salem.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి