హవ్వా.. 65 ఏళ్ల మహిళ 18 నెలల్లో 13 మందికి జన్మనిచ్చిందట, 59 ఏళ్ల మహిళ కూడా..
కాదేది కవితకు అనర్హం అని ప్రముఖ కవి శ్రీ శ్రీ సెలవిచ్చారు. కానీ అక్రమార్కులు మాత్రం దోచుకునేందుకు అడ్డదారులు తొక్కడం కామనే. కానీ బీహర్‌లో జరిగిన అవినీతి మాత్రం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. తాము నగదు దోచుకునేందుకు ఏకంగా 65 ఏళ్ల మహిళను గర్భవతి అని రికార్డులు సృష్టించారు. దీంతో బ్యాంక్ సిబ్బందితో కలిసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అకౌంటెంట్ చేతివాటం ప్రదర్శించారు. అయితే బ్యాంకు ఉద్యోగి ఒకరు ఖాతాలో నగదుపై అనుమానం వచ్చి.. వృద్దురాలి ఇంటికి రాగా అసలు విషయం వెలుగుచూసింది.

65 ఏళ్ల మహిళకు 13 మంది సంతానం.. అదీ కూడా 18 నెలల్లో
బీహర్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా చోటి కటియా గ్రామానికి చెందిన లీలా దేవికి 65 ఏళ్లు. ఆమెకు ఆరుగురు సంతానం కాగా.. చిన్న కుమారుడి వయస్సు 21 ఏళ్లు.. కానీ ముషాహరి బ్లాక్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మాత్రం ఆమెకు 13 పిల్లలకు జన్మనిచ్చినట్టు ఉంది. అదీ కూడా 18 నెలల్లోనే ఉండటంతో స్కాం జరిగిందని ఇట్టే అర్థమవుతోంది. లీలా దేవి సహా 18 మంది పేర్లను డెలివరీ స్కీం కింద చేర్చారు. చోటి కటియా, చుట్టపక్కల గ్రామాలకు చెందినవారి పేర్లు ఉన్నాయి. కానీ 17 మంది డెలివరీ కాలేదు.. కానీ లీలాదేవి మాత్రం డెలివరీ జరిగినట్టు రికార్డుల్లో ఉంది.

ఇలా వెలుగులోకి వచ్చింది..
లీలా దేవి బ్యాంకు ఖాతాలో నగదు జమయ్యేది. అయితే అందులో నుంచి ఎవరో ట్రాన్స్ ఫర్ చేయడంతో.. బ్యాంక్ సిబ్బంది గుర్తించారు. లీలా దేవి ఇంటికి వచ్చి ఆరాతీశారు. కస్టమర్ సర్వీస్ పాయింట్ వద్దకొచ్చి వేలిముద్ర వేయించుకొని.. సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. కానీ లీలాదేవికి మాత్రం అనుమానం వచ్చింది. తన పేరుతో కుంభకోణం చేశారని తెలుసుకుంది. అయితే డెలివరీ స్కీం కింద.. మహిళకు రూ.1400, ఆశ కార్యకర్తకు రూ.600 చొప్పున నగదు వస్తోంది. అయితే నగదు బ్యాంకు ఖాతాలో పడటంతో.. 18 మంది పేర్లతో స్కాం చేశారు.

బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కు..
వారి ఖాతాలు అన్నీ కస్టమర్ సర్వీస్ పాయింట్ వద్ద గల సుశీల్ కుమార్ ఓపెన్ చేశాడు. లీలా దేవితోపాటు.. అదే గ్రామానికి చెందిన షీలా దేవి (59) కూడా 13 నెలల్లో 8 మందికి జన్మనిచ్చినట్టు రికార్డుల్లో ఉంది. అందులో ఒకేరోజు ఇద్దరికీ జన్మనిచినట్టు ఉంది. విషయం ఏమిటంటే షీలా దేవికి వాస్తవానికి నలుగురు పిల్లలు కాగా.. అందులో చిన్న కూతుర వయస్సు 17 ఏళ్లు. బ్యాంకులో తన పేరుతో జరిగిన లావాదేవీలు తెలియదని షీలా దేవి పేర్కొన్నారు.
Recommended Video

పరారీలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అకౌంటెంట్..
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అకౌంటెంట్ అవదీస్ కుమార్‌కు స్కాంతో సంబంధం ఉంది పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కానీ ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఆపరేటర్ సుశీల్ కుమార్ పేరును మాత్రం చేర్చలేదు. ఘటనపై జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ విచారణకు ఆదేశించారు. ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కోరారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications