లంపీ వైరస్ టెన్షన్: భారీగా పశువుల మృత్యువాత
ఇప్పుడు కరోనా లేదు. జ్వరాల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో లంపీ వైరస్ వ్యాప్తి పెరిగింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 67 వేల పశువులు చనిపోయాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో పశువులకు ఈ ఏడాది జులైలో లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధి వ్యాపించడం మొదలైంది.ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పశువులకు వ్యాక్సిన్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
లంపీ స్కిన్ డిసీజ్ కు సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఆయా రాష్ట్రాల్లో 'గోట్ పాక్స్' వ్యాక్సిన్ ను పశువులకు ఇస్తున్నారు. ప్రత్యేకంగా లంపీ స్కిన్ డిసీజ్ కోసం జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో 'లంపీ ప్రోవాక్ ఇండ్' రూపొందించినట్టు వెల్లడించారు. వ్యాక్సిన్ మూడు, నాలుగు నెలల్లో అందుబాటులోకి రానున్నట్టు వివరించారు.

లంపీ స్కిన్ డిసీజ్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఒకట్రెండు లంపీ వైరస్ కేసులు నమోదైనట్టు కేంద్ర వ్యవసాయ, పశు సంవర్థక శాఖల అధికారులు చెబుతున్నారు.
గుజరాత్, రాజస్థాన్ లలో లంపీ స్కిన్ డిసీజ్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో రోజుకు వంద, రెండు వందల పశువులు చనిపోతున్నట్టు వివరించారు. గోట్ పాక్స్ వ్యాక్సిన్ లంపీ వైరస్ పై సమర్థవంతంగానే పనిచేస్తోందని.. ఇప్పటివరకు ఒకటిన్నర కోట్ల పశువులకు ఈ వ్యాక్సిన్ వేశారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications