ఎన్‌కౌంటర్: మావోయిస్టుల కాల్పుల్లో 7గురు పోలీసులు మృతి, 10మందికి గాయాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని పిడిమిలేరు వద్ద శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎస్టీఎఫ్ పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు ఎస్టీఎఫ్ పోలీసులు మరణించగా, 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

క్షతగాత్రులను రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. సుకుమా సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. పలువురు ఎస్టీఎఫ్ పోలీసులను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం.
కాగా, మావోయిస్టుల ఏరివేతకే ఎస్టీఎఫ్ పోలీసు బలగాలు పని చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications