నీటికుంటలో పడిన బస్సు: ఏడుగురు మృతి, 20మందికి గాయాలు
బంగా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బెల్దంగలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడింది.
ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని రక్షించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.

కాగా, మూడు రోజుల క్రితం పశ్చిమ మిడ్నాపూర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడగా, మరో 25మంది గాయాలపాలయ్యారు. రోడ్లు బాగోలేని కారణంగా రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications