ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు అక్కడికక్కడే మృతి... 32 మందికి గాయాలు...

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిలిబిత్ జిల్లాలోని పురాన్‌పూర్ సమీపంలో ఓ బస్సు-ఎస్‌యూవీ వాహనం ఢీకొన్నాయి. శనివారం(అక్టోబర్ 17) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా... మరో 32 మంది గాయపడ్డారు.

తెల్లవారుజామున 3గం.-4గం. మధ్యలో ప్రమాదం జరిగినట్లు ఫిలిబిత్ ఎస్పీ తెలిపారు. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితుల్లో ఎక్కువమంది ఫిలిబిత్‌కి చెందినవారేనని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా... బొలెరో వాహనంలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు.

 7 Killed, 32 Injured After Lucknow Bus Collides With SUV in Uttar Pradesh

Recommended Video

    Fact check:Watch Signal Crossing The Road But It's Not From Hyderabad రోడ్డు దాటుతున్న సిగ్నల్!!

    ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలు తరుచుగా సంభవిస్తున్నాయి. రెండు రోజుల క్రితం కబ్రాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ,ఆమె ఏడాది కుమారుడు మృతి చెందారు. కొడుకును ఎత్తుకుని ఆమె రోడ్డు పక్కన నిలుచున్న సమయంలో ఓ ట్రక్కు వీరిని ఢీకొట్టింది. ఇదే ఏడాది మే నెలలో ముజఫర్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వలస కార్మికులు మృతి చెందారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+