గుల్మార్గ్ లో ప్రమాదంలో 7గురు పర్యాటకులు మృతి
జమ్మూకాశ్మీర్ లోని గుల్మార్గ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. కేబుల్ కార్ల తీగలపై చెట్లు విరిగిపడడంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని గుల్మార్గ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. కేబుల్ కార్ల తీగలపై చెట్లు విరిగిపడడంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు.
గొడౌటా టవర్స్ మధ్య ఉన్న కేబుల్ కార్ల తీగలు దెబ్బతిన్నాయి. సహయకచర్యలు చేపట్టేందుకు సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొన్నాయి.

ఈ ప్రమాదంతో కేబుల్ కార్ల సర్వీసును తాత్కాలికంగా నిలిపివేశారు. గుల్మార్గ్ లోని హిమపర్వత సోయగాలు ఎంతో మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు.
పెనుగాలుల కారణంగా కేబుల్ కార్ల తీగలపై ఆదివారం నాడు చెట్లు విరిగిపడి ఈ ప్రమాదం చోటుచేసుకొంది.












Click it and Unblock the Notifications