వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్ : కుప్పకూలిన ఏడంతస్తుల భవనం... ఏడుగురు దుర్మరణం, 30 మందికి పైగా గాయాలు

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలవగా, 30 మందికి పైగా గాయపడ్డారు.గాయపడ్డారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కాన్పూర్: నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలవగా, 30 మందికి పైగానే గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లోని జజ్ మావు ప్రాంతంలో బుధవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏడాది కాలంగా నిర్మాణంలో ఉన్న ఓ ఏడంతస్తుల భవనం ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. ఆ సమయంలో భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి.

Building Collapse

కూలీలు ఎవరి పనుల్లో వారు మునిగి ఉండగా.. ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలవగా, 30 మందికి పైగానే గాయపడ్డారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు ఆర్మీ, పోలీసు అధికారులు,సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ముగ్గురిని బయటికి తీయగలిగారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం కాన్షీరాం మెమోరియల్ ట్రామా సెంటర్ కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.

ఈ భవనం కాన్పూర్ డెవలప్ మెంట్ అధారిటీ కాలనీలో, ప్రసిద్ధి చెందిన అల్లా హో అక్బర్ మసీదు పక్కనే ఉందని, మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరగవచ్చని కాన్పూర్ డిఐజి రాజేష్ మోదక్ తెలిపారు. భవనం కూలిపోవడానికి దాని పునాదులు బలహీనంగా ఉండడమే కారణమని తెలుస్తోంది.

మరోవైపు ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. జరిగిన ఘోరంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

English summary
At least seven people, most of them labourers, were killed and more than 30 injured when an under-construction building in Kanpur’s Jajmau area collapsed on Wednesday, officials said. Three people were rescued from the debris and rushed to the Kanshi Ram Memorial Trauma Centre for treatment. Doctors said they were in critical condition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X