7 సార్లు అమ్మకం, మారకుండా ఒక్కడే యజమాని!: ఢిల్లీ పేలుడు వెనుక మిస్టరీ కుట్ర!
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన దేశ రాజధాని భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తడమే కాకుండా దర్యాప్తు సంస్థలకు ఓ చిక్కుముడిని విసిరింది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పేలుడు సంభవించిన తెలుపు ఐ20 కారు.. కేవలం ఓ సంవత్సరంలోనే ఏడుగురి చేతులు మారినా, రికార్డుల్లో మాత్రం యజమాని పేరు మారలేదని తేలింది. ఈ కారే ఇప్పుడు ఉగ్రవాద కుట్రలో అత్యంత కీలకమైన ఆధారంగా మారింది.
ఈ పేలుడు నేపథ్యంలో ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. పార్లమెంట్ భవనం, ఇండియా గేట్, ఎయిర్పోర్టు, మెట్రో నెట్‌వర్క్ సహా అన్ని ప్రధాన ప్రదేశాలలో భద్రతను పెంచారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. "మేము ప్రతి కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నాం. దోషులను ఏ విధంగానూ వదిలిపెట్టం" అని స్పష్టం చేశారు.
దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారిన కారు చరిత్ర
HR26CE7674 నంబర్ గల ఈ కారు 2013లో తయారు చేయబడి 2014లో గురుగ్రామ్‌కు చెందిన సల్మాన్ పేరుపై నమోదైంది. పేలుడుకు సంబంధించిన అన్ని పత్రాలలో ఇప్పటికీ సల్మాన్ పేరే ఉంది. సల్మాన్‌ను విచారించగా.. అతను ఈ కారును ఓఖ్లా నివాసి దేవేంద్రకు అమ్మినట్లు తెలిపాడు. దేవేంద్ర దానిని అంబాలాకు చెందిన వ్యక్తికి, ఆ తర్వాత పుల్వామాకు చెందిన ఆమిర్‌కు విక్రయించారు. ఆమిర్ నుంచి ఈ కారు ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న డాక్టర్ ముజమ్మిల్ షకీల్ చేతికి చివరకు డాక్టర్ ఉమర్ మహమ్మద్ వరకు చేరింది.

దర్యాప్తు సంస్థలకు అందిన సమాచారం ప్రకారం.. ఈ కారు కనీసం ఏడుగురి చేతులు మారినా రిజిస్ట్రేషన్ మాత్రం సల్మాన్ పేరుపైనే ఉంది. పన్నులు, ఇతర పేపర్ వర్క్ నుంచి తప్పించుకునేందుకు సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్ బదిలీ చేయకపోవడం సాధారణమని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఈ లోపాన్ని క్రిమినల్ శక్తులు వాడుకుంటున్నట్లు దర్యాప్తు సూచిస్తోంది. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కారును ఉద్దేశపూర్వకంగానే జాడ దొరకకుండా చేయడానికి ప్రయత్నించారని దర్యాప్తులో తేలింది. దీనివల్ల అసలైన కుట్రదారులను చేరుకోవడం కష్టమవుతుంది. ఢిల్లీ పోలీసులు ఉపా, పేలుడు పదార్థాల చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెల్లవారుజామున పహాడ్‌గంజ్‌లోని ఒక హోటల్ నుంచి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పేలుడుకు ముందు కారు ప్రయాణం
సీసీటీవీ ఫుటేజీ ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడించింది. ఈ కారు ఫరీదాబాద్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించి బదర్‌పూర్ సరిహద్దు, ఐటీఓ, సరాయ్ కాలే ఖాన్ మీదుగా ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపానికి చేరుకుంది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. మధ్యాహ్నం 3:19 గంటలకు ఈ కారు ఒక మసీదు సమీపంలోని పార్కింగ్‌లోకి వచ్చింది. డ్రైవర్ బయటకు రాకుండానే ఆ కారు మరుసటి మూడు గంటల పాటు అక్కడే ఆగి ఉంది. సాయంత్రం 6:48 గంటలకు పార్కింగ్ నుంచి బయలుదేరి.. నేతాజీ సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వరకు చేరుకుంది. సరిగ్గా 6:52 గంటలకు భారీ పేలుడు సంభవించింది. చుట్టుపక్కల వాహనాలు దెబ్బతిన్నాయి.
ఆత్మహత్యా దాడి? లేక రిమోట్ దాడి?
భద్రతా సంస్థలు పేలుడు సమయంలో కారులో ఉన్న వ్యక్తి డాక్టర్ ఉమర్ అని భావిస్తున్నాయి. ఈ పేలుడు కారులో ఉన్న వ్యక్తి స్వయంగా చేసుకున్నాడా, లేదా అది రిమోట్ ద్వారా ప్రేరేపించబడిన పేలుడా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రాథమిక విచారణలో ఇది ఐఈడీ పేలుడుగా తేలింది. ఎన్ఎస్జీ, ఫోరెన్సిక్ నిపుణులు పేలుడు ప్రదేశం నుంచి సేకరించిన అవశేషాలపై రసాయనిక విశ్లేషణ చేస్తున్నారు. ఈ కేసులో ఫరీదాబాద్, గురుగ్రామ్, అంబాలా, పుల్వామాలో పోలీసులు, నిఘా సంస్థలు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications