వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణం తీసిన గుర్రపు స్వారీ: చిన్నారిని 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అలీబాగ్: సరదా కోసం చేసిన గుర్రపు స్వారీ యూకేకి చెందిన ఏడేళ్ల బాలిక ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లా మారథాన్ హిల్స్ స్టేషన్‌లో చోటు చేసుకుంది.
వపోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

యూకేకి చెందిన ఇండియా మెవ్యూతన కుటుంబ సభ్యులతో కలిసి అలీబాగ్‌లోని మాథరాన్ హిల్స్ స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం గుర్రంపై ఎంజాయ్ చేస్తుంది. అలా ఎంజాయ్ చేస్తున్న సమయంలో గుర్రం ఒక్కసారిగా పిచ్చిపట్టినదానిలా బాలికతో సహా అడవిలోకి పరుగు తీసింది.

దీంతో ఆ చిన్నారి గుర్రంపై నుంచి కిందపడింది. ఆ సమయంలో చిన్నారి కాలు గుర్రానికి ఉన్న కల్లెంలో ఇరుక్కుపోవడంతో చిన్నారిని సుమారు 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. చిన్నారికి తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తున్న మార్గం మధ్యలోనే తన ప్రాణాలను కోల్పోయింది.

7-yr-old UK girl dies as horse runs amok

చిన్నారి మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించేందుకు బుధవారం సాయంత్రం ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తండ్రి గోవిన్ మెవ్యూ దుబాయ్‌లోని ఒ చిన్న కంపెనీలో పనిచేస్తున్నాడు. ముంబైకి వచ్చిన అతడు తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు మాథరాన్ హిల్స్ స్టేషన్‌‌కు రాగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

చిన్నారి తల్లిదండ్రులు గుర్రుపు ఆపరేటర్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ప్రమాదశాత్తూ చిన్నారి మరణించినట్లుగా కేసు నమోదు చేసుకున్నట్లు మాథరాన్ హిల్స్ పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ రాజ్ వర్దన్ తెలిపారు.

English summary
A seven-year-old girl from UK died after she fell from a horse that ran amok and dragged her quite a distance at Matheran hill station in Maharashtra's Raigad district, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X