నగ్నంగా నడి రోడ్డుపై శవమై కనిపించిన 75 ఏళ్ల వృద్ధురాలు

బుర్ద్వాన్: 71ఏళ్ల క్రైస్తవ సన్యాసినిపై జరిగిన అత్యాచార ఘటన మరువకముందే పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. బుర్ద్వాన్‌కు 60కిలో మీటర్ల దూరంలో గల కత్వాలో నగ్నంగా ఉన్న 75 ఏళ్ల ఒక వృద్ధురాలు శవమైనడిరోడ్డుపై పడి ఉంది.

చరణ్ దాస్ ఆశ్రమానికి చెందిన వితంతువుగా ఆమెను గుర్తించారు. సంఘటనా స్ధలంలో ఒక జత పురుషుల పాదరక్షకలు, లైటర్, ఒక జత ట్రౌజర్లు లభ్యమయ్యాయి. దీంతో వృద్ధురాలిపై ఆత్యాచారం చేసి అనంతరం హత్య జరిగి ఉండవచ్చని ఆగ్రహించిన స్ధానికులు ఆశ్రమంపై దాడి చేశారు.

ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు బుర్ద్వాన్ ఎస్పీ కునాల్ ఘోష్ తెలిపారు. అయితే వృద్ధురాలిపై అత్యాచారం జరగలేదని పోస్ట్ మార్టం నివేదికలో తేల్చిందని వెల్లడించారు. ఈ ఘటనపై సీపీఐ-ఎమ్ పోలిట్ బ్యూరో సభ్యుడు సూర్జా కాంతా మిశ్రా మాట్లాడుతూ మమతా బెనర్జీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

 75-year-old woman's disrobed body found in West Bengal, rape suspected

ఇటీవల 71ఏళ్ల నన్‌పై జరిగిన అత్యాచార కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. "సున్నితత్వంను దృష్టిలో పెట్టుకొని ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాను" అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫేస్‌బుక్‌లో బుధవారం పోస్టు చేశారు.

ఇది ఇలా ఉంటే నన్‌పై జరిగిన అత్యాచారానికి సంబంధించి నివేదికను అందజేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి బుధవారం వివరణ కోరింది. ఈ కేసులో న్యాయం చేయాలని "క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా" అధ్యక్షుడు బాసెలియెన్ కార్డినల్ క్లీమిస్ ప్రభుత్వాన్ని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+