Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

76th Republic Day 2025: 76వ గణతంత్ర వేడుకలు పూర్తి షెడ్యూల్ ఇదే..!!

1950 జనవరి 26వ తేదీన తొలిసారిగా భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు. ఈ రోజున భారత్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ ఏడాది భారతదేశం తన 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్" (బంగారు భారతదేశం: ఘనమైన వారసత్వం పురోగతి) అనే నినాదంతో ఈ 76వ గణతంత్ర వేడుకలను దేశం నిర్వహిస్తోంది.

భారతదేశం రాజ్యాంగాన్ని స్వీకరించి బ్రిటీషు ఆధిపత్యం నుంచి సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మారినందున జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా యావత్ భారతదేశం జరుపుకుంటుంది. ఇక ఎప్పటిలాగే ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాంతో హాజరవుతున్నారు. ఇప్పటికే ఆయన భారత్‌కు చేరుకున్నారు. ఇండోనేషియాకు చెందిన 160 మంది సైనికులు, 190 మందితో కూడిన బ్యాండ్ కంటింజెంట్ కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌లో పాల్గొంటుంది. ఇక కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ముర్ము జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్ర గవర్నర్లు జాతీయ జెండాను ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

76th Republic Day 2025 Live Updates telugu President Murmu  PM Modi Speeches Highlights from AP Telangana

Jan 26, 2025, 12:43 pm IST
ఢిల్లీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్యపథ్ వద్ద గగనతలంపై వైమానిక దళం విన్యాసాలు ఆహ్వానితులను కట్టి పడేశాయి. అత్యంత శక్తిమంతమైన రాఫెల్ యుద్ధ విమానాలు సైతం ఇందులో పాల్గొన్నాయి.
Jan 26, 2025, 12:15 pm IST
ఢిల్లీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్యపథ్ వద్ద పరేడ్‌లో ఆకట్టుకున్న ఏపీ శకటం. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఏటికొప్పాక బొమ్మలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ శకటాన్ని రూపొందించారు.
Jan 26, 2025, 11:35 am IST
ఆంధ్రప్రదేశ్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఏఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని గోకులం అతిథి గృహం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు.
Jan 26, 2025, 11:13 am IST
ఢిల్లీ

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో బ్రహ్మోస్ క్షిపణి, పినాకా మల్టీ-లాంచర్ రాకెట్ సిస్టమ్, బీఎం- 21 అగ్నిబాణ్, మల్టిపుల్ బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాష్ వెపన్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Jan 26, 2025, 10:47 am IST
ఢిల్లీ

కర్తవ్యపథ్ వద్ద జాతీయ పతాకావిష్కరణతో ఆరంభమైన పరేడ్. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 300 మంది కళాకారుల బృందం ప్రదర్శన ఇచ్చింది.
Jan 26, 2025, 10:42 am IST
ఢిల్లీ

National Falg
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్తవ్యపథ్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం గన్ సెల్యూట్ స్వీకరించారు. రెపరెపలాడుతూ స్ఫూర్తినింపిన మువ్వన్నెల పతాకం
Jan 26, 2025, 10:38 am IST

గణతంత్ర దినోత్సవ వేడులకలో పాల్గొనడానికి కర్తవ్యపథ్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆహ్వానితులకు మోదీ అభివాదం చేశారు.
Jan 26, 2025, 10:35 am IST
ఢిల్లీ

President of India
గణతంత్ర దినోత్సవ వేడులకలో పాల్గొనడానికి సంప్రదాయబద్ధంగా గుర్రపు బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య అతిథి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాంతో
Jan 26, 2025, 10:30 am IST
ఢిల్లీ

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమరుల జీవితం ఆదర్శప్రాయం అంటూ అక్కడి విజిటర్స్ బుక్‌లో రాశారు.
Jan 26, 2025, 9:30 am IST
ఆంధ్రప్రదేశ్

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్
Jan 26, 2025, 9:10 am IST
తెలంగాణ

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలు. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
Jan 26, 2025, 8:55 am IST
కర్నాటక

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇందులో పాల్గొన్నారు.
Jan 26, 2025, 8:53 am IST
తెలంగాణ

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద గల అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళి అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Jan 26, 2025, 8:31 am IST
ఢిల్లీ

ఆహ్వానితులతో సందడిగా మారిన కర్తవ్యపథ్. క్రమంగా నిండిపోతున్న సందర్శకుల గ్యాలరీలు. ఈ ఉదయం సరిగ్గా 10:30 గంటలకు పరేడ్ ప్రారంభం కానుంది.
Jan 26, 2025, 8:15 am IST
ఢిల్లీ

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ సుసంపన్నమైన దేశ నిర్మాణానికి మరింత కృషి చేస్తామని అన్నారు.
Jan 26, 2025, 8:11 am IST
తెలంగాణ

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. దేశాన్ని సమున్నత స్థాయిలో నిలిపిన మహనీయులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
Jan 26, 2025, 8:02 am IST

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు.రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
Jan 26, 2025, 7:59 am IST
ఆంధ్రప్రదేశ్

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రపంచ వేదికపై మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడానికి సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
Jan 26, 2025, 7:52 am IST
ఢిల్లీ

ఒక్క న్యూఢిల్లీ జిల్లాలోనే 15,000 మంది భద్రతా సిబ్బందితో కూడిన ఆరు లేయర్‌ల భద్రతను ఏర్పాటు చేశారు. డేటా బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్, వీడియో ఎనలిటిక్స్‌తో కూడిన 2,500కు పైగా సీసీటీవీ కెమెరాల అమర్చారు.
Jan 26, 2025, 7:34 am IST
ఢిల్లీ

`స్వర్ణిమ్ భారత్‌- విరాసత్‌ ఔర్ వికాస్` అనే థీమ్‌తో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సాగనున్నాయి. రక్షణ వ్యవస్థ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటిచెప్పేలా అత్యాధునిక క్షిపణులు పరేడ్‌ నిర్వహించనున్నాయి.
Jan 26, 2025, 7:24 am IST
ఢిల్లీ

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 70,000 మంది పోలీసులు, భద్రత సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా సాగుతోంది.
Jan 26, 2025, 7:20 am IST
ఢిల్లీ

76వ గణతంత్ర దినోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కర్తవ్యపథ్ వద్ద కోలాహలం నెలకొంది. చలి తీవ్రతలోనూ ఆహ్వానితులు అక్కడికి చేరుకుంటోన్నారు.
Jan 26, 2025, 7:11 am IST
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలోని టీటీడీ పరిపాలన‌ భవనంలో గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామ‌ల‌రావు ఈ ఉదయం 8.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
Jan 26, 2025, 7:08 am IST
ఢిల్లీ

దేశ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు.
Jan 26, 2025, 12:08 am IST

గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాదర స్వాగతం పలికారు.
Jan 25, 2025, 10:08 pm IST

తెలంగాణకు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (వైద్యం)కి పద్మ విభూషణ్ అవార్డు వరించింది. తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం లభించింది.
Jan 25, 2025, 10:08 pm IST

ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు దక్కింది. నందమూరి బాలకృష్ణకు కళల విభాగంలో పద్మభూషణ్ పుస్కారం లభించింది.
Jan 25, 2025, 10:08 pm IST

ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ఎంపిక చేసింది.
Jan 25, 2025, 10:07 pm IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 139 మందికి ఈ పురస్కారాలను ప్రకటించింది.
Jan 25, 2025, 8:52 pm IST

మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+