8 నెలలు, 3 లక్షల కిలోమీటర్లు: మోడీ రికార్డ్ ప్రయాణం
న్యూఢిల్లీ: ప్రధాని అవుతారని చాలామంది గట్టిగా విశ్వసిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి నేత నరేంద్ర మోడీ ఈ ఎన్నికలలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయన ప్రచారంలో రికార్డును నమోదు చేశారు! గత ఎనిమిది నెలలుగా బిజెపి, ఎన్డీయే కూటమి విజయం కోసం అలుపెరగని ప్రచారం చేస్తున్న మోడీ... ఆదివారం తన ప్రచారాన్ని ముగించారు.
ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ఎనిమిది నెలలు, 5800కు పైగా ర్యాలీలు, చర్చలు, ఇతర కార్యక్రమాలు, మూడు లక్షలకు పైగా కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసినట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. విశాల, వినూత్న, సంతృప్తికరమైన ప్రయాణం అని పేర్కొన్నారు.

కాగా, గతేడాది సెప్టెంబర్ 15న నరేంద్ర మోడీని పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా బిజెపి ప్రకటించింది. అప్పటి నుంచి ఆయన విస్తృత స్థాయిలో పర్యటిస్తూనే ఉన్నారు. తొలుత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత లోకసభ ఎన్నికల కోసం ఆయన తన ప్రచారాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ వస్తున్నారు.
మే 12న జరిగే చివరి దశ పోలింగ్ ప్రచారం ముగిసే 10వ తేదీ లోపు మోడీ మొత్తం 437 బహిరంగ సభల్లో ప్రసంగించిన నేతగా రికార్డుకెక్కారు! అలాగే 3లక్షల కిలోమీటర్ల దూరం పర్యటించిన నేతగానూ ఘనత సొంతం చేసుకోనున్నారు. దీనికి తోడు 3డి టెక్నాలజీ ద్వారా 1,350 సభల్లోనూ ఆయన ప్రసంగాలు పూర్తి చేశారు.












Click it and Unblock the Notifications