దళిత విద్యార్థులతో టాయిలెట్ల క్లీనింగ్: 8మంది టీచర్లు అరెస్ట్

తిరునల్వేలి: జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో దళిత విద్యార్థులతో బలవంతంగా మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న 8 మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నాళ్లు టీచర్లు దళిత విద్యార్థులతో పాఠశాల మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నట్లు బయటికి రావడంతో పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో దళితులు ఆందోళన చేపట్టారు.

కళాక్కడ్ సమీపంలోని కీలపతాయి పండితంకురిచిలోని పాఠశాలలో జరుగుతున్న ఈ దారుణ ఘటనపై వారం రోజులుగా దళితులు ఆందోళనలు చేస్తున్నారు. సంబంధిత ఉపాధ్యాయులను కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత 8 నెలలుగా దళిత విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నట్లు వారు ఆరోపించారు.

8 teachers arrested in Tamil Nadu for allegedly forcing Dalit students to clean toilets

ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల నుంచి తొలుత ఎలాంటి స్పందన రాలేదు. 20 రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై దళిత సంఘాల ఆందోళనలతో గురువారం నిందిత 8 మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన టీచర్ల వివరాలు తెలిపేందుకు గానీ, పెట్టిన కేసుల గురించి తెలిపేందుకు గానీ పోలీసులు సుముఖత వ్యక్తం చేయలేదు.

కాగా, 6 నుంచి 8వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థులతో పాఠశాల సమయంలోనే బలవంతంగా మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. మరుగుదొడ్లను శుభ్రం చేయనట్లయితే తీవ్రంగా కొడతామని కూడా ఆ విద్యార్థులను టీచర్లు బెదిరించినట్లు ఆరోపించారు.

మరుగుదొడ్లు శుభ్రం చేయించడంతో ఓ విద్యార్థి పాఠశాలకు కూడా వెళ్లడం మానేశాడని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వామపక్షాల పార్టీల నేతలు, దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ నేరం రుజువైతే నిందితులైన టీచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+