ఆరుగురు పోలీసుల సస్పెండ్ : 8 ఏళ్ల బాలిక లైంగికదాడి కేసులో చర్యలు

భోపాల్ : పసితనం పోని పిల్లలను కూడా వదలడం లేదు నీచులు. ఒకడిని చూసి మరొకడు రెచ్చిపోతున్నాడు. దీంతో బంగారు భవిష్యత్ ఉన్న పిల్లలు పసిప్రాయంలోనే కీచకుల చేతిలో పడి జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో తప్పిపోయిన చిన్నారి చనిపోయింది. ఆమెపై లైంగికదాడి చేసిన నిందితులు .. గొంతునులిమి చంపినట్టు పోలీసులు తెలిపారు.

చివరి చూపు ..
భోపాల్‌లోని కమలనగర్‌కు చెందిన 8 ఏళ్ల బాలిక .. గత శనివారం రాత్రి 8 గంటలకు ఇంటినుంచి షాపుకెళ్లింది. ఎంతకీ తిరిగిరాలేదు. గుట్కా కోసం అని షాపుకు పంపిస్తే .. తిరిగిరాని లోకాకలకు వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత విచారణ చేపట్టిన పోలీసులు .. ఆ మరునాడు ఆదివారం ఉదయం మురుకికుంటలో విగతజీవిగా మారిన బాలిక మృతదేహన్ని కనుగొన్నారు. వైద్య పరీక్షలు చేయించగా .. బాలికపై లైంగికదాడి చేసి ... తర్వాత గొంతునులిమి చంపినట్టు నిర్ధారించారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేస దర్యాప్తు చేస్తున్నారు.

8-year-old girl raped, strangulated in Bhopal; 6 police officials suspended

ముమ్మర గాలింపు చర్యలు ...
ఈ కేసుకు సంబంధించి నిందితుల కోసం తమ బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులు ఎంతటివారైనా సరే వదిలిపెట్టబోమని ఆ రాష్ట్ర హోంమంత్రి బాలా బచ్చన్ పేర్కొన్నారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ఆరుగురిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఇందులో ఒకరు ఎఎస్ఐ కాగా, కానిస్టేబుల్ ఒకరు, మిగిలిన నలుగురు అధికారులు ఉన్నారని వివరించారు. వీరి సస్పెన్షన్‌తో తాము ఎంత కఠినంగా ఉన్నామో అర్థం చేసుకోవాలని స్పష్టంచేశారు. అంతేకాదు విధి నిర్వహణలో కానిస్టేబుల్ నిర్లక్ష్యం వహించారని .. పోలీసు కంప్లైంట్ కు సరిగా స్పందించలేదని బాధితులు చెప్పారని గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+