ఈశాన్యరాష్ట్రాల్లో వరదలు: 85 మంది మృతి, వేల ఎకరాల్లో పంట వేస్ట్
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల వల్ల దాదాపు 85 మంది మృతి చెందారు.
గౌహతి: ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల వల్ల దాదాపు 85 మంది మృతి చెందారు.
అస్సాంలో వరద పరిస్థితిపై కేంద్ర మంత్రి రిజుజు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. వరదల కారణంగా సంభవించిన నష్టంపై మంత్రి రిజుజు కేంద్రానికి నివేదిక అందజేయనున్నారు.

వరదల కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా రాష్ట్రాల్లోని వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. 58 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది.
అస్సాంలో వరద పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోగౌనోవాల్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications