వామ్మో.. ఇదేంది.. రెమిడెసివర్ టీకాల దొంగతనం.. 850 చోరీ.. సర్కార్ సీరియస్
కరోనా వైరస్ కోసం వాడుతోన్న రెమిడెసివర్ ఇంజెక్షన్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ధర కూడా గణనీయంగా తగ్గించింది. రూ.2 వేల వరకు డిక్రిజ్ చేసింది. అయితే ఇదే అదనుగా భావించిన కొందరు రెమిడెసివర్ ఇంజెక్షన్లు దొంగిలించారు. ఒకటి కాదు రెండు కాదు 850 టీకాలను తీసుకెళ్లారు.
మధ్యప్రదేశ్‌లో గల గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రి నుంచి కొందరు టీకాలను దొంగిలించారు. గత మూడు వారాల నుంచి భోపాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ రెమిడెసివర్ ఇంజెక్షన్ కొరత ఉంది. ఆస్పత్రిలో బెడ్స్, ఆక్సిజన్ కొరత కూడా ఉంది. కరోనా రోగుల కోసం రెమి డెసివర్ టీకా పంపిణీ చేయాల్సి ఉంది. గత వారం జిల్లా ఆస్పత్రి షెల్ప్‌లలో టీకాలను భద్రపరిచారు. అయితే కనిపించకుండా పోయాయి.

ఇంతకుముందు రూ.3 వేల వరకు ఉండే టీకాను.. రూ.20 వేలకు విక్రయిస్తున్నారు. లంగ్స్ దెబ్బతిన్న వారికి ఐదురోజుల్లో ఆరు రెమి డెసివర్ టీకాలు ఇవ్వాల్సి ఉంది. దీనిని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. టీకాలు మిస్సింగ్ కావడాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తప్పుచేసిన వారికి శిక్ష తప్పదని అధికారులు స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications