వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా దెబ్బకు తమిళనాడు హడల్: పగ, ప్రైవేట్ పాల పంచాయితీ, నాణ్యత లేదు, ప్రాణహాని !

తమిళనాడులో సరఫరా అవుతున్న ప్రైవేటు పాలలో నాణ్యత లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టులో నివేదిక సమర్పించింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో సరఫరా అవుతున్న ప్రైవేటు పాలలో నాణ్యత లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టులో నివేదిక సమర్పించింది. అయితే పాలలో రసాయనాలు మాత్రం కలపలేదని, ఎలాంటి ప్రాణహాని లేదని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు నివేదిక సమర్పించింది.

<strong>చంద్రబాబు తలుచుకుంటే: పళనిసామి సీరియస్, ప్రభుత్వం కూలిపోతోంది!పాల దెబ్బ!</strong>చంద్రబాబు తలుచుకుంటే: పళనిసామి సీరియస్, ప్రభుత్వం కూలిపోతోంది!పాల దెబ్బ!

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో మొత్తం 886 పాల ఉత్పత్తుల శాంపిళ్లను సేకరించి పరిశోధనలు జరిపించామని, అందులో 338 శాంపిళ్లలో నాణ్యత లేదని వెలుగు చూసిందని తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు నివేదిక సమర్పించింది.

మంత్రి దెబ్బతో

మంత్రి దెబ్బతో

ప్రైవేటు పాలలో రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారని తమిళనాడు పాడి, డెయిరీల అభివృద్ది శాఖ మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రసాయనాలు కలిపి పాలు విక్రయించే ప్రైవేటు పాల సంస్థల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సీఎం దెబ్బతో మౌనం !

సీఎం దెబ్బతో మౌనం !

పక్క రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ) నుంచి వచ్చే ప్రైవేటు పాలలో రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారని సంచలన ప్రకటన చేసిన మంత్రి మీద తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. నివేదిక వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడాలని సూచించడంతో ఆయన కొంత కాలంగా మౌనంగా ఉన్నారు.

ఆంధ్రా మీద పగ ?

ఆంధ్రా మీద పగ ?

కాంగ్రెస్ పార్టీకి చెందిన సూర్యప్రకాష్ అనే న్యాయవాది మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రైవేటు పాలలో రసాయనాలు కలుపుతున్నారని స్వయంగా మంత్రి వ్యాఖ్యలు చేశారని, మీరు చర్యలు తీసుకోవాలని కోర్టులో మనవి చేశారు.

338 శాంపిళ్లలో నాణ్యత లేదు !

338 శాంపిళ్లలో నాణ్యత లేదు !

తమిళనాడులోని 32 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంతో ప్రత్యేక కమిటీలు వేసి ప్రైవేటు పాల శాంపిళ్లు సేకరించి పరిశోధన చేశామని, అందులో 338 శాంపిళ్లలో నాణ్యత లేదని వెలుగు చూసిందని ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖ అధికారులు మద్రాసు హైకోర్టులో నివేదిక సమర్పించారు.

రూ. లక్షల్లో ఫైన్ !

రూ. లక్షల్లో ఫైన్ !

143 చోట్ల సురక్షితంగా లేని ప్రైవేటు పాలు విక్రయిస్తున్న వారి మీద కేసులు నమోదు చేసి రూ. 10,26,300 అపరాద రుసుం వసూలు చేశామని కోర్టులో నివేదిక సమర్పించారు. అలాగే కాలం చెల్లిన పాలు విక్రయిస్తున్నారని 83 మందిపై కేసు నమోదు చేసి రూ. 6,50,500 అపరాద రుసుం వసూలు చేశామని కోర్టులో చెప్పారు.

సీబీఐతో విచారణ !

సీబీఐతో విచారణ !

ప్రైవేటు పాలలో రసాయనాలు కలిపారని మంత్రి చేసిన వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని న్యాయవాది సూర్యప్రకాష్ మద్రాసు హైకోర్టులో మనవి చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ పిటిషన్ విచారణ చేసింది.

ఆంధ్రా పాలకు భారీ దెబ్బ ?

ఆంధ్రా పాలకు భారీ దెబ్బ ?

ప్రైవేటు పాలలో రసాయనాలు కలుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ మౌనంగా ఉన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్న కొన్ని సంస్థల ప్రైవేటు పాల విక్రయాలు చాల వరకు తగ్గిపోయాయని కొందరు వ్యాపారులు అంటున్నారు.

నీళ్లు, విజిటబుల్ ఆయిల్ ?

నీళ్లు, విజిటబుల్ ఆయిల్ ?

మొత్తం మీద కొన్ని సంస్థలు సరఫరా చేస్తున్న ప్రైవేటు పాలలో ఎక్కువ శాతం నీళ్లు, విజిటబుల్ ఆయిల్ మిశ్రమం మాత్రం ఉందని తమిళనాడు ప్రభుత్వం హైకోర్టులో నివేదిక సమర్పించింది. 32 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంకా పరిశోధనలు చేస్తున్నారని అధికారులు అంటున్నారు.

ఆంధ్రా దెబ్బకు మౌనం ?

ఆంధ్రా దెబ్బకు మౌనం ?

ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్న పాల సంస్థలను టార్గెట్ గా చేసుకుని మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే కేంద్రంలోని ఓ పెద్ద మనిషి జోక్యం చేసుకుని ఆంధ్రా పాల జోలికి రావద్దూ అంటూ వార్నింగ్ ఇవ్వడంతో మంత్రి బాలాజీ మౌనంగా ఉండిపోయారని తెలిసింది.

English summary
The Tamil Nadu government informed the Madras High Court that 886 samples of milk taken from 32 districts were examined and found safe. However, 11 of the 338 samples of milk products tested were found unsafe for consumption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X